83
తెలంగాణలో మరో 12 రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు సంచలన ఆరోపణలు చేశారు. అధికార బీఆర్ఎస్ తనను కొనాలని చూసిందని ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ఆయన అధికార పార్టీలో ఓటమి భయం మొదలైందని అన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ తనకు రూ. 20 కోట్లు ఆఫర్ చేసినట్టు తెలిపారు. రూ. 100 కోట్లు ఇచ్చినా తాను అమ్ముడుపోయే మనిషిని కాదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో వివేక్ వెంకటస్వామిని గెలిపించాలని కోరిన ఆయన కాంగ్రెస్ గెలిస్తే మనకు సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చినట్టేనని పేర్కొన్నారు. మీరు వివేక్‌ను గెలిపిస్తే మీ అభివృద్ధికి తాను అండగా ఉంటానని చెన్నూరు ప్రజలకు మాటిచ్చారు.