78
తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్రమోదీ అధికంగా నిధులు కేటాయించారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. నారాయణపేటలో నిర్వహించిన బీజేపీ సకల జనుల సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఫలాలు ప్రజలకు అందలేదన్నారు. జమ్మూ కశ్మీర్, బీహార్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్ సహా అనేక రాష్ట్రాల్లో కుటుంబ పార్టీలు ఉన్నాయన్నారు. జమ్మూ కశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లా కుటుంబం, బీహార్లో లాలు కుటుంబం, ఏపీలో వైఎఎస్సార్, ఆ తర్వాత జగన్ కుటుంబం, తమిళనాడులో కరుణానిధి కుటుంబం ఉందన్నారు. ఇప్పుడు తెలంగాణ వచ్చాక కూడా కేసీఆర్ కుటుంబానికే లబ్ధి జరిగిందన్నారు. ధరణి పోర్టల్ పేరుతో కేసీఆర్ పేదల భూములు దోచుకున్నారని జేపీ నడ్డా ఆరోపించారు.