78
గుజరాత్ లోని అహ్మదాబాద్ స్టేడియంలో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య చివరి క్రికెట్ పోరు జరగనుంది. ఇదివరకే భారత్ రెండు సార్లు క్రికెట్ కప్ గెలుచుకుంది. ఆస్ట్రేలియా ఐదు పర్యాయాలు గెలుచుకొని కప్ కైవసం చేసుకుంది. మధ్యాహ్నం జరగనున్న పైనల్ మ్యాచ్ లో ఇరు జట్లు రసవత్తరంగా తలపడనున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో అభిమానుల కోసం అన్ని జిల్లాల్లో భారీ స్ర్కీన్ లను ఏర్పాటు చేశారు. ఇరు జట్ల క్రికెటర్లు ప్రపంచ కప్ తో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మరి కప్ ని భారత్ గెలుచు కుంటుందా లేక ఆస్ట్రేలియాకి కట్ట బెడుతుందా అన్నది అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.