పుష్ప పల్లకిపై దర్శనమిచ్చిన శ్రీ స్వామి అమ్మవార్లు…

Shri Swami Ammavarlu who appeared on flower palanquin...

Advertisements

&NewLine;<p>నంద్యాల జిల్లా శ్రీశైల మహక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంభరాన్నంటాయి&period; శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి అమ్మవారు బ్రహ్మోత్సవాలు ఆరోవరోజు పుష్పపల్లకిలో భక్తులకు దర్శనమిచ్చారు&period; పుష్పపల్లకిలో శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించి హారతులిచ్చారు&period; విద్యుత్ దీపకాంతుల నడుమ శ్రీశైల పురవీధులలో శ్రీ స్వామి అమ్మవార్లు గ్రామోత్సవానికి తరలుతుండగా ఉత్సవం ముందు కోలాటాలు డమరక నాధాలు పలు రకాల విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి&period; ఆలయం ముందు పలు రకాల పుష్పాలతో దేదీప్యమానంగా సర్వాంగ సుందరంగా తయారుచేసిన పుష్పపల్లకిలో శ్రీస్వామి అమ్మవార్లు గ్రామోత్సవంలో భక్తులను కనువిందు చేశారు&period; గంగాధర మండపం వద్ద పుష్పపల్లకిలో ఉన్న శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక హారతులిచ్చి అనంతరం అంకాలమ్మ గుడి&comma; నంది మండపం బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు శ్రీస్వామి అమ్మవార్ల గ్రామోత్సవం కన్నులపండువగా సాగింది&period; గ్రామోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిమంది భక్తులు తరలివచ్చారు&period; పుష్ప పల్లకిపై ఉన్న శ్రీ స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు&period; శ్రీశైల క్షేత్రమంత శివనామస్మరణతో మారు మ్రోగింది&period; పుష్ప పల్లకి సేవలో ఆలయ చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి&comma; ఈవో పెద్దిరాజు దంపతులు&comma; ఆలయ ట్రస్టు బోర్డ్ సభ్యులు&comma; అధికారులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..