కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం, కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా గన్నవరం లో శ్రీ కాశీ విశాలాక్షి అన్నపూర్ణ సహిత విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం లో పోటెత్తిన భక్తులు, ఈరోజు తెల్లవారుజాము నుంచి భక్తులు ఆ శివుని దర్శించుటకు క్యూ లైన్ లో వేచి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి శ్రద్దలతో కార్తీక సోమవారాన్ని ఆచరిస్తున్నారు. మామిళ్ళపల్లి సాంబశివరావు ప్రధానా అర్చకులు.. శివ కేశవులు కు ఇష్టమైన ప్రీతికరమైన రోజులు కార్తిక మాసాలు రోజులు మొదలవుగానే స్నానాలు ఆచరించటం దేవతలు సైతం స్నానాలు ఆచరిస్తారని పురాణాలలో ఇతిహాసాలలో ఉన్నాయి. సూర్యోదయానికి పూర్వమే స్నానాలు ఆచరించాలని పురాణాల్లో ఉన్నాయి. శివునికి విశేషంగా కార్తీక మాసాలలో రుద్రాభిషేకాలు చేసి ఆ పరమశివుని దర్శకున్నట్లయితే కోటి జన్మల్లో ఉన్న పాపాలైన తొలగిపోతాయని నమ్మకం.. ఒక బిల్వహ పత్రాన్ని గనుక శివునికి సమర్పించినట్లయితే కోటి జన్మల లో ఉన్నటువంటి పాపాలన్నీ తొలగిపోతాయని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ కార్తీకమాసం రోజుల్లో సోమవారం రోజు ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకున్నాక స్వామివారి సన్నిధిలో దీపారాధన చేసి ఒక పూట భోజనం చేసినట్లయితే చాలా ఫలితము పుణ్య మోకాలు లభిస్తాయని పురాణాలు వివరిస్తున్నాయి. కృత్తికా నక్షత్రంలో వచ్చినటువంటి పౌర్ణమి రోజున కార్తీక పౌర్ణమి అంటారు. ఆ పౌర్ణమి రోజున జ్వాలాతోరణం 365 ఒత్తులు వెలిగిస్తారు. ఎందుకంటే అందరికీ అన్ని రోజులు అనుగుణంగా ఉండదని ఈ సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసినటువంటి ఫలితం రావాలని కార్తీక మాసాల పుణ్య రోజుల్లో 365 ఒత్తులు వెలిగించి పుణ్యాన్ని పొందవచ్చు అని పురాణాత్మకంగా తెలియజేయబడింది. కాబట్టి ఈ కార్తీకమాసానికి అంతట విశిష్టత ఉంది. ఈ కార్యక్రమంలో ఆలయ రాజా పోషకులు కాసర్నేని బాబురావు, కాసర్నేని శ్రీనివాసు భక్తుల సందర్శనార్థం దేవాలయంలో అనేక ఏర్పాట్లు చేశారు.
Read Also..