సింగరేణి సంస్థను నష్టాల పాలు చేశారు – సీతారామయ్య

Sitaramaiah

Advertisements

&NewLine;<p>ఏఐటీయూసీతోనే సింగరేణి కార్మికుల హక్కులు సాధ్యమని కార్మికులందరూ ఏఐటీయూసిని గెలిపించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కార్మికులను కోరారు&period; పెద్దపెల్లి జిల్లా రామగుండం ఏరియా వన్ జీడికే టు ఇంక్లైన్ పై ఏర్పాటు చేసిన గేటు మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ&period;&period; గతంలో పనిచేసిన యూనియన్లు సింగరేణి యాజమాన్యంతో కుమ్మక్కై లాభాల బాటలో ఉన్న సింగరేణి సంస్థను నష్టాల పాలు చేశారని అన్నారు&period; కార్మికుల హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటాలు చేసి అనేక హక్కులను సాధించిన ఘనత ఏఐటియూసికే దక్కిందని అన్నారు&period; సింగరేణిలో కొత్తగనుల ఏర్పాటు కోసం&comma; ఉద్యోగాల కల్పన కోసం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు&period; ఈసారి తమ యూనియన్ కి అవకాశం ఇవ్వాలని కార్మికులను కోరారు&period; ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శి మడ్డి&period; ఎల్లయ్య&comma; బ్రాంచి అధ్యక్షులు రంగు శ్రీనివాస్ గౌడ్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.