సింగరేణిలో ఉపాధి కోల్పోయిన 213 మంది ప్రైవేటు గార్డులు..

Advertisements

<p>మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి ప్రాంతంలో ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల సమస్య తీవ్ర రూపం దాల్చింది&period; దాదాపు 11 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న 213 మంది గార్డులు టెండర్ గందరగోళం కారణంగా ఒక్కసారిగా ఉపాధి కోల్పోయారు&period; సింగరేణి సంస్థలో ఆస్తుల పరిరక్షణ&comma; బొగ్గు గనుల భద్రత కోసం 2015లో ప్రైవేటు గార్డులను నియమించగా&comma; అప్పటి నుంచి స్థానిక నిరుద్యోగులు&comma; భూ నిర్వాసితులు&comma; కార్మిక కుటుంబాలకు చెందిన వారు ఈ ఉద్యోగాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు&period; తక్కువ వేతనాలకే అయినా కుటుంబాలను పోషించుకుంటున్న ఈ గార్డులు&comma; కాంట్రాక్ట్ ముగియడంతో రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది&period; ప్రతి రెండేళ్లకోసారి టెండర్ ప్రక్రియ ద్వారా నియామకాలు జరగడం వల్ల ఉద్యోగ భద్రత లేకుండా పోతుంది &period; ఇప్పటివరకు కొనసాగిన విధులు అకస్మాత్తుగా నిలిచిపోవడంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు&period; విధులకు పిలవకపోవడంతో కుటుంబాలపై ఆర్థిక భారం పెరిగి&comma; గార్డులు నిరాశలో మునిగిపోయారు&period;<&sol;p>&NewLine;<p>2025లో కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత కొత్త టెండర్ ప్రక్రియలో వచ్చిన అభ్యంతరాలు సమస్యను మరింత క్లిష్టం చేశాయి&period; మొదట 130 మంది కోసం టెండర్ పిలిచినా వివాదాలు తలెత్తడంతో పాత కాంట్రాక్టర్‌కు తాత్కాలికంగా పొడిగింపు ఇచ్చారు&period; అయితే 2026 ఫిబ్రవరి 28తో అది కూడా ముగియడంతో పరిస్థితి మరింత సంక్లిష్టమైంది&period; జనవరిలో మరోసారి 90 మంది కోసం టెండర్ పిలిచినా నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో కేసు కోర్టుకు వెళ్లి ప్రక్రియ నిలిచిపోయింది&period; దీంతో మొత్తం 213 మంది గార్డులు ఉపాధి కోల్పోయారు&period; గత 40 రోజులుగా వారు నిరసనలు&comma; ర్యాలీలు&comma; ధర్నాలు నిర్వహిస్తూ తమ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు&period; కార్మిక సంఘాలు కూడా వారికి మద్దతు తెలుపుతున్నాయి&period; కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పాత పోస్టులను కొనసాగిస్తూ వెంటనే కొత్త టెండర్ పిలిచి తమకు తిరిగి ఉపాధి కల్పించాలని గార్డులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు&period;ఈ సందర్భంగా సెక్యూరిటీ గార్డులు భిక్షాటన చేసి నిరసన తెలిపారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..