ఇంటాబయటా పనుల ఒత్తిడీ, ఆధునిక జీవనశైలితో చాలామంది రక్తపోటు బారిన పడుతున్నారు. తినే ఆహారంలో తరచూ కొన్ని పదార్థాలను చేర్చుకోవడం వల్ల ఆ సమస్య దరిచేరకుండా చూసుకోవచ్చు. వెల్లుల్లి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. రోజుకి మూడు వెల్లుల్లి పలుకులు తింటే రక్త ప్రసరణ సాఫీగా ఉంటుంది. నిమ్మకాయ రోజూ కాస్త నిమ్మరసం తాగితే, రక్తనాళాలకు మంచిది. రక్తపోటు వల్ల నాళాలు దెబ్బతినే పరిస్థితి తలెత్తదు. తులసి పొద్దున లేచిన వెంటనే బ్రష్ చేసుకొని నాలుగు తులసి ఆకులు నోట్లో వేసుకుని నమిలితే, చెడు కొలెస్ట్రాల్ పెరగదు. బంగాళాదుంప తొక్కతో ఉన్న బంగాళాదుంపలు ఉప్పుని తక్కువ పీల్చుకుంటాయి. వీటిల్లో పొటాషియం పాళ్లు ఎక్కువ. రక్తపోటు రాకుండా చూడటంలో పొటాషియం ఎంతో ఉపయోగపడుతుంది. బియ్యం ఎక్కువ పాలిష్ పెట్టని బియ్యంతో వండిన అన్నంలో కొలెస్ట్రాల్, కెలొరీలు తక్కువగా ఉంటాయి. అలాగే ఉప్పు శాతం తక్కువగా, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. క్యాల్షియం నరాల వ్యవస్థని చల్లబరిచి ఎలాంటి ఒత్తిడి లేకుండా చేస్తుంది. దీనివల్ల బ్లడ్‌ప్రెషర్ అదుపులో ఉంటుంది.
రక్తపోటు రానివ్వని కొన్ని పదార్ధములు
95
previous post