బంగాళదుంపలతో చాలా రకాల ఆహార పదార్థాలను తయారు చేస్తారు. బర్గర్ నుంచి చిప్స్ వరకు చాలా రకాల ఫాస్ట్ ఫుడ్‌లలో ఉపయోగిస్తారు. అయితే బంగాళదుంపలు ఎక్కువగా తింటే బరువు పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. బరువు పెరగడం వల్ల అనేక రోగాలు వస్తాయి. బంగాళదుంపల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. శరీరంలో కార్బోహైడ్రేట్ల పరిమాణం పెరిగితే కొవ్వు కూడా పెరుగుతుంది. దీని వల్ల మనిషి ఊబకాయానికి గురవుతాడు. ప్రాసెస్ చేసిన బంగాళదుంపలు సాధారణ బంగాళదుంపల కంటే చాలా ప్రమాదకరమైనవి. వీటితో చిప్స్, ఇతర ఫాస్ట్ ఫుడ్స్ తయారు చేస్తారు. ఈరోజుల్లో ఫాస్ట్ ఫుడ్ తినే ట్రెండ్ ప్రజల్లో బాగా పెరిగిపోయింది. పిల్లలు వీటికి బానిసలుగా మారుతున్నారు. పిల్లల్లో ఊబకాయం పెరగడానికి ప్రధాన కారణం ఇదే. ఇది అనేక వ్యాధులకు దారితీస్తోంది. ఎలాంటి వ్యాధి లేని వ్యక్తి వారంలో రెండు రోజులు బంగాళదుంపలు తినవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రోజూ శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసే వారు మూడు రోజులు బంగాళదుంపలు తినవచ్చు. అయితే ఉడికించిన బంగాళదుంపలు తినడానికి ప్రయత్నించాలి. దీని వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. పరిమిత పరిమాణంలో బంగాళదుంపలను తింటే శరీరంలో స్టార్చ్ పరిమాణం పెరుగుతుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. తరచుగా ఎసిడిటీ సమస్యతో బాధపడుతుంటే బంగాళాదుంపలను తినడం మానుకోండి. ఇది సమస్యను మరింత పెంచుతుంది.
potato
బంగాళాదుంప తినేందుకు రుచిగా ఉండటమే కాదు, అందానికి అడ్డుగా నిలిచే ఎన్నో సమస్యల్ని తీరుస్తుంది. కళ్ల నుంచి జుట్టు వరకు అందాన్ని పెంపొందించడంలో ముందుటుంది. ఎవరి ముఖంలోనైనా మొదట ఆకర్షించేవి కళ్లే. అయితే కళ్ల చుట్టూ నల్లటి వలయాలు రావడం, కళ్లు ఉబ్బడం లాంటివి ఇబ్బంది పెట్టే సమస్యలు. బంగాళాదుంపని ముక్కలుగా చేసి జ్యూసర్లో వేస్తే కొంచెం జ్యూస్ వస్తుంది. దానిలో దూది ముంచి, కళ్లపై పావుగంట సేపు ఉంచుకోండి. ఇలా రోజూ చేస్తూ ఉంటే నల్లని వలయాలు తగ్గుతాయి. బంగాళాదుంప రసంతో రోజూ ముఖాన్ని కడుక్కుంటే ముడతలు రావడం తగ్గుతుంది. ముఖంపై వచ్చే తెల్లమచ్చల్లాంటివి కూడా పోతాయి. ఎండకి కమిలిపోయి బొబ్బలెక్కిన చర్మానికి బంగాళాదుంప రసాన్ని రాసిన చర్మం మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తుంది. చక్కని ఛాయకి బంగాళాదుంపని మిక్సీలో వేసి మెత్తగా చేసేయండి. ఆ పేస్టుని ముఖానికి రాసుకుని అరగంటపాటు వదిలేయండి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువు అవడంతో పాటు, ఛాయ పెరుగుతుంది. చర్మంపై ఉన్న జిడ్డుని కూడా అది పీల్చేసుకుంటుంది. దాంతో ముఖం తాజాగా మారుతుంది. అలాగే బంగాళాదుంప రసానికి కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి పట్టించి, పావుగంట తరువాత కడిగేసుకుంటే చర్మం రంగు తేలుతుంది. ఒక స్పూను బంగాళాదుంప రసానికి స్పూను ముల్తానీ మట్టిని కలపండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరే వరకూ ఉంచండి. మొదట గోరువెచ్చటి నీళ్లతో, తరవాత చన్నీళ్లతో కడిగేసుకోండి. అలాగే బంగాళాదుంపని బాగా ఉడకబెట్టి ముద్దలా చేయండి. చల్లారాక ఒక స్పూను పాల పౌడర్ని, ఒక స్పూను బాదం నూనెని కలిపి పేస్టులా చేయండి. దానిని ముఖానికి రాసుకుని పావుగంట తరవాత శుభ్రపరుచుకోండి.
ఇంటాబయటా పనుల ఒత్తిడీ, ఆధునిక జీవనశైలితో చాలామంది రక్తపోటు బారిన పడుతున్నారు. తినే ఆహారంలో తరచూ కొన్ని పదార్థాలను చేర్చుకోవడం వల్ల ఆ సమస్య దరిచేరకుండా చూసుకోవచ్చు. వెల్లుల్లి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. రోజుకి మూడు వెల్లుల్లి పలుకులు తింటే రక్త ప్రసరణ సాఫీగా ఉంటుంది. నిమ్మకాయ రోజూ కాస్త నిమ్మరసం తాగితే, రక్తనాళాలకు మంచిది. రక్తపోటు వల్ల నాళాలు దెబ్బతినే పరిస్థితి తలెత్తదు. తులసి పొద్దున లేచిన వెంటనే బ్రష్ చేసుకొని నాలుగు తులసి ఆకులు నోట్లో వేసుకుని నమిలితే, చెడు కొలెస్ట్రాల్ పెరగదు. బంగాళాదుంప తొక్కతో ఉన్న బంగాళాదుంపలు ఉప్పుని తక్కువ పీల్చుకుంటాయి. వీటిల్లో పొటాషియం పాళ్లు ఎక్కువ. రక్తపోటు రాకుండా చూడటంలో పొటాషియం ఎంతో ఉపయోగపడుతుంది. బియ్యం ఎక్కువ పాలిష్ పెట్టని బియ్యంతో వండిన అన్నంలో కొలెస్ట్రాల్, కెలొరీలు తక్కువగా ఉంటాయి. అలాగే ఉప్పు శాతం తక్కువగా, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. క్యాల్షియం నరాల వ్యవస్థని చల్లబరిచి ఎలాంటి ఒత్తిడి లేకుండా చేస్తుంది. దీనివల్ల బ్లడ్‌ప్రెషర్ అదుపులో ఉంటుంది.
బంగాళాదుంప తినేందుకు రుచిగా ఉండటమే కాదు, అందానికి అడ్డుగా నిలిచే ఎన్నో సమస్యల్ని తీరుస్తుంది. కళ్ల నుంచి జుట్టు వరకు అందాన్ని పెంపొందించడంలో ముందుటుంది. కళ్లకి మెరుపు ఎవరి ముఖంలోనైనా మొదట ఆకర్షించేవి కళ్లే. అయితే కళ్ల చుట్టూ నల్లటి వలయాలు రావడం, కళ్లు ఉబ్బడం లాంటివి ఇబ్బంది పెట్టే సమస్యలు. బంగాళాదుంపని ముక్కలుగా చేసి జ్యూసర్లో వేస్తే కొంచెం జ్యూస్ వస్తుంది. దానిలో దూది ముంచి, కళ్లపై పావుగంట సేపు ఉంచుకోండి. ఇలా రోజూ చేస్తూ ఉంటే నల్లని వలయాలు తగ్గుతాయి. ముడతలు పోయేలా బంగాళాదుంప రసంతో రోజూ ముఖాన్ని కడుక్కుంటే ముడతలు రావడం తగ్గుతుంది. ముఖంపై వచ్చే తెల్లమచ్చల్లాంటివి కూడా పోతాయి. ఎండకి కమిలిపోయి బొబ్బలెక్కిన చర్మానికి బంగాళాదుంప రసాన్ని రాసిన చర్మం మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తుంది. చక్కని ఛాయకి బంగాళాదుంపని మిక్సీలో వేసి మెత్తగా చేసేయండి. ఆ పేస్టుని ముఖానికి రాసుకుని అరగంటపాటు వదిలేయండి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువు అవడంతో పాటు, ఛాయ పెరుగుతుంది. చర్మంపై ఉన్న జిడ్డుని కూడా అది పీల్చేసుకుంటుంది. దాంతో ముఖం తాజాగా మారుతుంది. అలాగే బంగాళాదుంప రసానికి కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి పట్టించి, పావుగంట తరువాత కడిగేసుకుంటే చర్మం రంగు తేలుతుంది. ఫేస్‌మాస్క్‌లు ఒక స్పూను బంగాళాదుంప రసానికి స్పూను ముల్తానీ మట్టిని కలపండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరే వరకూ ఉంచండి. మొదట గోరువెచ్చటి నీళ్లతో, తరవాత చన్నీళ్లతో కడిగేసుకోండి. అలాగే బంగాళాదుంపని బాగా ఉడకబెట్టి ముద్దలా చేయండి. చల్లారాక ఒక స్పూను పాల పౌడర్ని, ఒక స్పూను బాదం నూనెని కలిపి పేస్టులా చేయండి. దానిని ముఖానికి రాసుకుని పావుగంట తరవాత శుభ్రపరుచుకోండి.




Total views : 78867