లోక్‌సభపై కొందరు దుండగులు దాడి…

Some thugs attacked the Lok Sabha

Advertisements

&NewLine;<p>లోక్‌సభ లో కొందరు దుండగులు చొరబడి ఎంపీలను భయభ్రాంతులకు గురిచేయడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది&period; సభా కార్యకలాపాలు కొనసాగుతున్న సమయంలోనే ఓ వ్యక్తి గ్యాలరీ నుంచి కిందకు దూకుతూ నినాదాలు చేయగా&period;&period; మరోవ్యక్తి ఒకరకమైన పొగను వదలడం కలవరం సృష్టించింది&period; ఇదే సమయంలో పార్లమెంటు బయట మరో ఇద్దరు దుండగులు ఈ తరహాలోనే ఆందోళనలు చేశారు&period; వీరందర్నీ అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>లోక్‌సభ లోపల పట్టుబడిన వారు కర్ణాటకకు చెందిన సాగర్‌ శర్మ&comma; దేవ్‌రాజ్‌లుగా గుర్తించినట్లు తెలుస్తోంది&period; వీరిద్దరూ మైసూర్‌కు చెందినవారని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం&period; పార్లమెంటు బయట నిరసన చేసిన ఇద్దరు వ్యక్తుల్లో ఒక మహిళ కూడా ఉన్నారు&period; రంగుల పొగను వెదజల్లుతూ ఆందోళనకు దిగిన వీరిద్దరినీ ట్రాన్స్‌పోర్టు భవనం ముందు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు&period; ఈ ఘటనలో పాల్గొన్న మహిళ హరియాణాలోని హిసార్‌కు చెందిన నీలం కాగా&comma; మరో వ్యక్తి మహారాష్ట్ర లాతూర్‌కు చెందిన అమోల్‌ శిందే గా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు&period; పార్లమెంటు లోపల&comma; వెలుపల జరిగిన ఈ ఘటనలకు సంబంధించి ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం దర్యాప్తు చేస్తుందని అధికారులు వెల్లడించారు&period; లోపలికి చొరబడిన ఇద్దరు వ్యక్తులు ఓ ఎంపీ సిఫార్సుతోనే లోనికి చేరినట్లు తెలుస్తోంది&period; అయితే&comma; కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ వాయువును వెదజల్లే గొట్టాలను లోనికి ఎలా తీసుకెళ్లారనే విషయం మిస్టరీగా మారింది&period; ఇది కచ్చితంగా భద్రతా వైఫల్యమేనని పలువురు ఎంపీలు అభిప్రాయపడుతున్నారు&period; కాగా&comma; 2001 లో ఇదే రోజు పార్లమెంట్ పై దాడి జరిగింది&period; ఈ దాడికి నేటితో 22 ఏళ్లు పూర్తయ్యాయి&period; సరిగ్గా ఇదే రోజు ఆగంతుకులు లోక్ సభలో చొరబడడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.