కీలకంగా మారిన స్పీకర్ ఎంపిక….

congress

Advertisements

&NewLine;<p>హైదరాబాద్ ఎల్పీ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు&period; ఈ సందర్బంగా మిగిలిన మంత్రులు కూడా ప్రమాణం చేస్తారని భావించారు&period; అయితే&comma; సీఎం పదవి దక్కని సీనియర్లు తమ శాఖలు&period;&period;ప్రాధాన్యతల పైన ఇప్పటికీ హైకమండ్ పై ఒత్తిడి తెస్తున్నారు&period; సామాజిక సమీకరణాలు దెబ్బ తినకుండా మంత్రివర్గ కూర్పు చేయాలని కాంగ్రెస్ నాయకత్వం సూచించింది&period; దీంతో&period;&period;పూర్తి స్థాయి మంత్రివర్గం కాకుండా&period;&period; రేవంత్ సీఎంగా&period;&period; మరో ఆరుగురు మాత్రమే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తెలంగాణలో కొత్త మంత్రివర్గం పైన ఢిల్లీలో కసరత్తు జరుగుతోంది&period; రేవంత్ సీఎం కావటంతో ఇప్పుడు కొత్తగా పీసీసీ చీఫ్ పదవి మరొకరికి ఖరారు చేయాల్సి ఉంటుంది&period; ఇదే సమయంలో స్పీకర్ ఎంపిక సైతం కీలకంగా ఉంది&period; ప్రతిపక్షం బలంగా ఉండటంతో స్పీకర్ పదవికి ఎంపిక పైన ఆచి తేచి వ్యవహరిస్తున్నారు&period;<br>ఇక&period;&period;రేవంత్ తో పాటుగా సామాజిక వర్గాల వారీగా సీనియర్లుకు ప్రమాణం చేసే అవకాశం ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది&period; అందులో భాగంగా ఎస్సీ వర్గం నుంచి భట్టి విక్రమార్క&comma; మాదిగ వర్గం నుంచి దామోదర రాజనర్సింహ&comma; ఎస్టీ వర్గం నుంచి మహిళకు ఇచ్చేలా సీతక్క&comma; మైనార్టీ వర్గం నుంచి షబ్బీర్ అలీ&comma; ఉత్తమ్ కుమార్ రెడ్డి&comma; బీసీ వర్గం నుంచి ఒక సీనియర్ నేతకు అవకాశం ఉందని తెలుస్తోంది&period; చివరి నిమిషంలో మార్పులు జరిగితే మినహా ఈ ఆరుగురు ప్రమాణం చేయటం ఖాయంగా కనిపిస్తోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం ఖరారైనట్లు తెలుస్తోంది&period; మంత్రి పదవుల కోసం ఢిల్లీ అగ్రనాయకత్వాన్ని పలువురు ప్రముఖులు కలుస్తున్నారు&period; జీ వినోద్ నేరుగా సోనియాను కలిసి మంత్రి పదవి కోరారు&period; ఈ రాత్రిలోగా కసరత్తు పూర్తయితే పూర్తి స్థాయి మంత్రివర్గం పూర్తవుతుందని భావిస్తున్నారు&period; అయితే&comma; కసరత్తు పూర్తి కాకుంటే ఈ ఆరుగురితో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.