విజయవాడ వేదికగా నేడు డబ్ల్యూఏపీఎల్ ప్లేయర్స్ ఆక్షన్.

Advertisements

<p>మహిళల ఏపీ ప్రీమియర్ లీగ్ ప్లేయర్స్ ఆక్షన్‌కు సర్వం సిద్ధమైంది&period; విజయవాడ వేదికగా నేడు డబ్ల్యూఏపీఎల్ ప్లేయర్స్ వేలం జరగనుంది&period; వేలంలో 191 మంది మహిళా క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు&period; మేటి ఆటగాళ్ల కోసం నాలుగు ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి&period; ఒక్కో ఫ్రాంచైజీకి ప్లేయర్ల కొనుగోలు కోసం రూ&period;15 లక్షల బడ్జెట్ కేటాయించారు&period; ఒక్కో జట్టులో కనిష్టంగా 18 మంది&comma; గరిష్టంగా 20 మంది ఆటగాళ్లను తీసుకునే అవకాశం ఉంది&period; వేలంలో మొత్తం 191 మంది ప్లేయర్లు ఉండగా&period;&period; 45 మంది గ్రేడ్-ఏ&comma; 146 మంది గ్రేడ్-బీ కేటగిరీలో ఉన్నారు&period; గ్రేడ్-ఏ ఆటగాళ్ల బేస్ ప్రైస్ 50 వేలు కాగా&period;&period; గ్రేడ్-బీ ప్లేయర్ల బేస్ ప్రైస్ 30 వేలుగా నిర్ణయించారు&period; డబ్ల్యూఏపీఎల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మాజీ భారత కెప్టెన్ మిథాలీ రాజ్ వ్యవహరించనున్నారు&period; అమరావతి ఛాంపియన్స్&comma; రాయలసీమ జెన్ స్టార్స్&comma; వైజాగ్ ఫైర్ బర్డ్స్&comma; గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్లు లీగ్‌లో బరిలోకి దిగనున్నాయి&period; సెప్టెంబర్ 15 నుంచి 26 మధ్య డబ్ల్యూఏపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు&period; మంగళగిరి ఏసీఏ స్టేడియం వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి&period; విజయవాడలో జరగనున్న ప్లేయర్స్ ఆక్షన్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి&period; ప్రముఖ డబ్ల్యూపీఎల్ వేలం నిర్వాహకురాలు శ్వేతా బాల్ ఆధ్వర్యంలో వేలం నిర్వహించనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.