శ్రీలంక క్రికెట్ బోర్డును సస్పెండ్ చేసిన ఐసీసీ

ICC

Advertisements

&NewLine;<p>అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డును సస్పెండ్ చేసింది&period; శ్రీలంక క్రికెట్ వ్యవహారాల్లో ప్రభుత్వ&comma; రాజకీయ జోక్యం కనిపిస్తోందంటూ… లంక క్రికెట్ బోర్డును ఐసీసీ తన సభ్య దేశాల జాబితా నుంచి తొలగించింది&period; ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది&period;ఓ సభ్య దేశంగా ఐసీసీ నియమావళిని శ్రీలంక క్రికెట్ బోర్డు తీవ్రస్థాయిలో ఉల్లంఘించిందని ఐసీసీ పేర్కొంది&period; ఐసీసీ సభ్య దేశాల క్రికెట్ బోర్డుల్లో ప్రభుత్వ&comma; రాజకీయ జోక్యం ఉండరాదన్న నిబంధనను శ్రీలంక క్రికెట్ అతిక్రమించిందని వివరించింది&period; స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోవడంలో విఫలమైందని తెలిపింది&period; ఈ కారణంగానే శ్రీలంక క్రికెట్ బోర్డుపై వేటు వేస్తున్నట్టు ఐసీసీ స్పష్టం చేసింది&period; ఐసీసీ తాజా చర్యలకు బలమైన కారణమే ఉంది&period; వరల్డ్ కప్ టోర్నీలో శ్రీలంక జట్టు దారుణ ప్రదర్శన కనబర్చింది&period; 9 మ్యాచ్ లు ఆడి 7 మ్యాచ్ ల్లో ఓడిపోయింది&period; దాంతో టోర్నీ నుంచి ఎప్పుడో నిష్క్రమించింది&period; ముఖ్యంగా&comma; టీమిండియా చేతిలో ఘోర పరాజయం చవిచూసింది&period; ఆసియా కప్ ఫైనల్లో ఎలా కుప్పకూలిందో&comma; వరల్డ్ కప్ లోనూ టీమిండియా బౌలర్ల ధాటికి కకావికలమైంది&period; దాంతో శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యలందరిపైనా ఆ దేశ క్రీడల మంత్రి రోషన్ రణసింఘే వేటు వేశారు&period; బోర్డు తాత్కాలిక పాలనాధ్యక్షుడిగా మాజీ సారథి అర్జున రణతుంగను నియమించారు&period; ఈ అంశమే ఐసీసీ ఆగ్రహానికి కారణమైంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..