74
అనంతపురం జిల్లాలో వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు. గుత్తి పట్టణంలో కన్నులపండుగగా శ్రీరామ శోభాయాత్ర జరిగింది. జనవరి నెల 22వ తేదీన అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం సందర్భంగా గుత్తిలో శ్రీరాములవారి అక్షితల విగ్రహాల ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని పురాతన రామాలయం నుండి శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. యాత్ర దేవాలయం నుండి గాంధీచౌక్ ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా సాగింది. మండలంలోని ప్రతి గ్రామానికి స్వామివారి అక్షితలను కమిటీ సభ్యులు అందజేశారు.