తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి Srikalahasti :
రేపటి నుంచి ప్రారంభం కానున్న శ్రీకాళహస్తి దేవస్థానం మహాశివరాత్రి(Mahashivratri) బ్రహ్మోత్సవాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. శ్రీకాళహస్తి దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు తేదీ 3- 3 – 2024 నుండి 16- 3 -24 వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడుచున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల లో భాగంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అంగరంగ వైభవంగా విద్యుత్ దీపాల అలంకరణ, గోపురాలకు మరమ్మత్తులు మరియు స్వామి అమ్మవార్లు పురవీధులలో ఊరేగే వాహన సేవలు అన్ని ఏర్పాట్లు చేసినారు అంతేకాకుండా ఆలయమంతా రంగు ముగ్గులతో చక్కటి మామిడి తోరణాలు, పుష్పాలంకరణల మధ్య కనులు మిరుముట్లు కొలిపే విద్యుత్ అలంకరణలు చేసినారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండుటకు ఏర్పాట్లు చేయించుటకు తిరుపతి జిల్లా కలెక్టర్, తిరుపతి జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ మరియు సంబంధిత అధికారులు శ్రీకాళహస్తీశ్వరాలయ కార్యనిర్వాహణాధికారి మరియు అధికారులు గట్టి చర్యలు చేపట్టారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి