కార్తికమాసం సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రం భక్తుల రద్దీతో సందడిగా మారింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయం వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున కార్తిక దీపారాధనలు నిర్వహించారు. గంగాధర మండపం, ఆలయం ఉత్తర మాఢవీధి కార్తిక దీపారాధనలతో శోభాయమానంగా మారింది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు పౌర్ణమి గడియలు ఉన్నట్లు దేవస్థానం అర్చకులు తెలిపారు.
ఈ నేపథ్యంలో సాయంత్రం 6 గంటలకు శ్రీశైలంలోని పాతాళగంగ వద్ద పుణ్యనది హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా దేవస్థానం అర్చకులు కృష్ణవేణి నదీమతల్లికి కర్పూర హారతులు ఇవ్వనున్నారు. రాత్రి 7 గంటలకు ఆలయం ముందు భాగంలోని గంగాధర మండపం వద్ద శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు జ్వాలాతోరణోత్సవం జరగనున్నది. ఈ ఉత్సవంలో రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా పాల్గొననున్నారు.
శ్రీశైలం కార్తిక పౌర్ణమి దీపారాధనలు
82
previous post