82
కృష్ణాజిల్లా మచిలీపట్నం తాళ్లపాలెం బీచ్లో ఆదివారం విషాదఛాయలు అల్లుకున్నాయి. నూజివీడు త్రిబుల్ ఐటీ లో చదువుతున్న 5 గురు స్టూడెంట్ ఉదయాన్నే మచిలీపట్నం బీచ్ లో స్థానం చేయడానికి దిగిన కొద్దిసేపటికి సముద్రపు అలలు పెద్ద ఎత్తున రావడంతో కొట్టుకుపోతున్న నలుగురిని మెరైన్ పోలీసులు రక్షించారు. అదే సమయంలో పెద్ద అలల కింద తోకల అఖిల్ కొట్టుకుపోవడం విషాదాన్ని మిగిల్చింది. మెరైన్ పోలీసులు తీవ్ర ప్రయత్నం చేసిన అతని జాడ కనపడలేదు. గల్లంతయిన అఖిల్ కోసం మెరైన్ ఎస్ఐ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు.