67
నిజాం కాలేజీలో విద్యార్థినులు తరగతులు బహిస్కరించి రోడ్డుపైన నిరసనకు దిగారు. నిజాం కాలేజ్ హాస్టల్ లో సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నాం. సమస్యల పరిష్కరించాలని ప్రిన్సిపాల్ భీమా నాయక్ ని అడిగితే పరిష్కరించడం లేదు. ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్లినా మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేసారు. ఒక్క బెడ్ పై ముగ్గురు విద్యార్థులు ఉండాలంటే ఎలా అంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వెంటనే ప్రిన్సిపాల్ స్పందించి మా సమస్యలు పరిష్కారం చేయాలని ఆందోళన వ్యక్తం చేసారు.