82
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని 8 గ్రామ శివారులోని పరిగి మండలం బొమ్మరాస్ పేట్ మండలానికి చెందిన సాగర్ కాలేజ్ లో ఉన్న బాలికల వసతి గృహంలో 13 మంది విద్యార్థులకు వాంతులు విరోచనాలు కావడంతో చేవెళ్ల లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులను అడగగా నిన్న రాత్రి 7 గంటల 30 నిమిషాలకు దొండకాయ కర్రీ మరియు సాంబార్ తిన్నామని రాత్రి 9 గంటలకు కడుపునొప్పి వచ్చిందని విద్యార్థులు చెప్తున్నారు. ఇదే విషయమై హాస్టల్ లో పనిచేసే వ్యక్తులను అడిగితే నిన్న ఆదివారం కావడంతో వాళ్ల తల్లిదండ్రులు వచ్చి తినిపించారని దానివల్లనే ఫుడ్ పాయిజన్ అయిందేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల పరిస్తితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.