ఇన్ఫోసిస్(Infosys) వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి(Sudhamurthy)ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Draupadi Murmu) రాజ్యసభకు నామినేట్ చేశారు. ఈ మేరకు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోడీ ట్వీట్(Prime Minister Modi tweet) చేశారు. సామాజిక సేవలో సుధామూర్తి(Sudhamurthy) స్ఫూర్తిదాయక ముద్ర వేశారని కొనియాడారు. విద్యతోపాటు విభిన్న రంగాలకు సుధామూర్తి సేవలందించారని..ఆమె పదవీకాలం ఫలవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాని మోడీ ఆకాక్షించారు. ఆమె రాజ్యసభలో ఉండటం నారీశక్తికి నిదర్శనమని మోదీ అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఒక ఉపాధ్యాయురాలుగా ప్రస్థానం ప్రారంభించిన సుధామూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్(Infosys Foundation)ను ప్రారంభించారు. ఆమె భర్త ఎన్ఆర్ నారాయణ మూర్తి(NR Narayana Murthy) ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు. సుధా మూర్తి రచయిత, దాతృత్వాన్ని నమ్ముతారు. 2006లో ఆమె చేసిన సామాజిక సేవకు గానూ ప్రభుత్వం భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందుకున్నారు. 2023లో ఆమెకు భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్ కూడా లభించింది.
ఇది చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి