బాపట్ల నియోజకవర్గంలోని అడవి పంచాయతీ పరిధిలో ఉన్న సూర్యలంక బీచ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరు గాంచింది.

Advertisements

<p>బాపట్ల నియోజకవర్గంలోని అడవి పంచాయతీ పరిధిలో ఉన్న సూర్యలంక బీచ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరు గాంచింది&period; కార్తీక మాసం&comma; వారాంతాలు&comma; పబ్లిక్ హాలిడేస్ రోజుల్లో కుటుంబ సమేతంగా వేలాదిమంది పర్యాటకులు ఇక్కడికి తరలివచ్చి సముద్రతీర అందాలను ఆస్వాదిస్తున్నారు&period; కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ 2&period;0 పథకం కింద రూ&period;97&period;52 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడంతో సూర్యలంక మరింత ఆకర్షణీయంగా మారింది&period; ఈ నేపథ్యంలో ప్రైవేట్ రిసార్ట్స్ సంఖ్య వేగంగా పెరుగుతోంది&period; సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకార కుటుంబాలు ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తూ జీవనం సాగిస్తున్నాయి&period; అయితే గత ప్రభుత్వంలో ఇచ్చిన అనుమతుల మేరకు కొన్ని చోట్ల రిసార్ట్స్ నెలకొల్పారు &period;వీటిపై కేసులు నడుస్తున్నాయి &period; అభివృద్ధి ఒకవైపు కొనసాగుతుండగా&comma; నియంత్రణ లేకపోవడం మరోవైపు సమస్యలకు దారి తీస్తోంది&period; పర్యాటక రంగం అభివృద్ధి చెందుతున్నప్పటికీ&comma; దానితో పాటు వచ్చే సమస్యలను పరిష్కరిం చాల్సిన అవసరం కూడా ఉంది &period;<&sol;p>&NewLine;<p>సూర్యలంకలో అనధికార రిసార్ట్స్ పెరుగుదల స్థానిక సమస్యలను మరింత తీవ్రతరం చేస్తోంది&period; మత్స్యకారులకు ప్రభుత్వం కేటాయించిన సెంటు&comma; సెంటున్నర స్థలాలను కొంతమంది రిసార్ట్స్ యజమానులు అక్రమంగా కొనుగోలు చేసి వ్యాపారం చేస్తున్నారు&period; ఈ రిసార్ట్స్‌లో గదులను గంటకు రూ&period;1000 నుంచి రూ&period;3000 వరకు అద్దెకు ఇచ్చి భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు&period; దీంతో పర్యాటకులపై ఆర్థిక భారం పడటమే కాకుండా&comma; స్థానిక ప్రజల జీవన విధానంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి&period; కొంతమంది మత్స్యకార కుటుంబాలు కూడా తమ ఇళ్లను రిసార్ట్స్‌గా మార్చి అద్దె ఆదాయంపై ఆధారపడుతున్నారు&period; అంతేకాకుండా కొన్ని రిసార్ట్స్ అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి&period; ఈ పరిస్థితులు పర్యాటకుల భద్రతకు ముప్పుగా మారుతున్నాయి&period; అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఈ మార్పులు నియంత్రణలో లేకపోతే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p>మరో వైపు అనధికార రిసార్ట్స్ వల్ల అడవి పంచాయతీకి రావాల్సిన ఆదాయం భారీగా తగ్గిపోతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; పన్నులు&comma; అనుమతులు లేకుండా నడుస్తున్న ఈ వ్యాపారాల వల్ల ప్రభుత్వానికి&comma; పంచాయతీకి నష్టం కలుగుతోంది&period; అయితే అధికారులు మాత్రం ఈ సమస్యపై తగిన చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది&period; సూర్యలంక బీచ్ అభివృద్ధి చెందుతున్న తరుణంలో పర్యాటకుల రద్దీ పెరగడంతో రిసార్ట్స్ పుట్టగొడుగుల్లా పెరుగుతున్నాయి&period; దీనివల్ల పంచాయతీ ఆదాయం తగ్గడమే కాకుండా అసాంఘిక కార్యకలాపాలు కూడా పెరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు&period; పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు&period; అనధికార నిర్మాణాలను నియంత్రించి&comma; పంచాయతీకి సరైన ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటే మాత్రమే సూర్యలంక పర్యాటక కేంద్రంగా సుస్థిర అభివృద్ధి సాధించగలదని అభిప్రాయం వ్యక్తమవుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..