అనుమానంతో భార్య తలపై నరికిన భర్త..

Attempt murder

Advertisements

&NewLine;<p>భార్య ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త అనుమానంతో భార్య తల నరికిన సంఘటన గురువారం రాత్రి రొంపిచెర్లలో చోటు చేసుకుంది&period; ఎస్ఐ కృష్ణయ్య కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి&period;&period; రొంపిచెర్ల గ్రామపంచాయతీ&comma; పాలెం వీది కి చెందిన వాహిదా &lpar;32&rpar; పీలేరుకు చెందిన ఖాజా కిజర్ &lpar;42&rpar; ఇరువురు 14 సంవత్సరాల క్రితం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు&period; వీరికి ఒక కుమారుడు&comma; ఒక కుమార్తె ఉన్నారు&period; భర్త ఆర్టీసీ కండక్టర్ గా పనిచేస్తుండేవాడు&period; అయితే మూడు సంవత్సరాల క్రితం భర్త ఉద్యోగానికి రాజీనామా చేసి ఆటో నడుపుకుంటున్నాడు&period; ఈ క్రమంలో భార్య ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానంతో వారం రోజులుగా భార్యాభర్తలు ఘర్షణ పడుతున్నారు&period; గురువారం రాత్రి 7 గంటలకు కత్తితో భార్య తల మీద నరికి వేశాడు&period; దీంతో పిల్లలు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆమెను అతని నుండి విడిపించి పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period; అక్కడ డాక్టర్ల పరీక్షించి&comma; పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారని తెలియజేశారు&period; రొంపిచెర్ల పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు&period; ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేస్తామని ఎస్సై కృష్ణయ్య తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్