ఏపీ సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. వై ఏపీ హేట్స్ జగన్ అంటూ ఓ పోస్టర్ ను మీడియాలో ఆయన పోస్ట్ చేశారు. అందులో రాష్ర్ట ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించారు. నాలుగేళ్ల ఎనిమిది నెలల కాలంలో జగన్ ఘన కార్యాలకు ఈ ఒక్క చిత్రం సరిపోతుందన్నారు. ప్రజలు ఏపీ హేట్స్ జగన్, వద్దు.. వద్దు.. ఈ జగన్, మళ్లీ మాకొద్దు ఈ జగన్ అని ఎందుకంటున్నారో ఇప్పటికైనా అర్థమైందా జగన్ అంటూ ప్రశ్నించారు. వైసీపీ నేతలు ఏపీకి జగనే ఎందుకు కావాలని ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దానికి సెటైరికల్ గా గంటా శ్రీనివాసరావు ఈ పోస్టర్ ను ట్విటర్ లో షేర్ చేశారు.
#AndhraPradesh #
ఎన్టీఆర్ జిల్లా మైలవరం లో ఏసీబీ ట్రాప్, ఫారెస్ట్ ఆఫీస్ లో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ఏ.రామకృష్ణ ఇంటిపై ఏసీబీ దాడులు జరిగాయి, రెడ్డిగూడెం మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన రైతు గండిపూడి రాంబాబు అనే వ్యక్తి రామకృష్ణ కి 23వేలు లంచం ఇస్తుండగా ట్రాప్ చేసి పట్టుకున్న ఏసీబీ అధికారులు ఫారెస్ట్ కార్యాలయం దగ్గర్లో రామకృష్ణ అద్దెకు ఉండే గదిలో తనిఖీలు చేస్తున్న ఏసీబీ బృందం.
పల్నాడు ప్రజల కష్టాలు, కన్నీళ్లు తెలిసిన వ్యక్తుల్లో తాను కూడా ఒకరినని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. కృష్ణమ్మ ఒడ్డునే ఉన్నప్పటికీ మాచర్లకు కృష్ణమ్మ నీళ్లు అందని పరిస్థితి నెలకొందని చెప్పారు. ఈ క్రమంలో పల్నాడుకు వరికపూడిశెల ఎత్తిపోతల ప్రాజెక్టు అవసరం ఎంతుందనేది తెలిసిన అతికొద్దిమందిలో తానొకడినని చెప్పారు. దశాబ్దాలుగా ఈ సమస్యను ఎవరూ పట్టించుకోలేదని విమర్శించారు.
ఎర్రచందనం పెంపకం, ఎగుమతుల పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పరిమితంగా పండే ఎర్రచందనాన్ని సంక్లిష్ట వాణిజ్య ప్రక్రియ సమీక్ష నుంచి తొలగించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ప్రకటన చేశారు. సాగుకు కేంద్రం అనుమతులు ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నది.కేంద్రం ప్రకటనతో రైతులకు ఎర్రచందనం సాగు చేసే వెసులుబాటు కలిగింది. అలాగే ఎగుమతి చేసుకునేందుకు కూడా ప్రోత్సాహం లభించినట్లయింది. ఈ ఎర్రచందనం చెట్లు ప్రపంచంలోనే చాలా అరుదైన జాతికి చెందినవి. వీటికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఏపీలోని శేషాచలం, వెలుగొండల్లో మాత్రమే ఎర్రచందనం అధికంగా పెరుగుతుంది. ప్రధానంగా, శేషాచలం కొండల్లో పెరిగే ఎర్రచందనంలో ఎక్కువ చేవ ఉండడంతో దానికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
ఏపీలో విద్యార్థుల సామగ్రి కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఇచ్చే వస్తువుల నాణ్యత సరిగా లేదని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది రూ.1,050 కోట్లతో విద్యార్థులకు బ్యాగులు, షూస్ కొనుగోలు చేశారన్నారు. 42 లక్షల మంది పేద విద్యార్థుల కోసం కొనుగోలు ఆర్డర్లు ఇచ్చారన్నారు. ఈ పథకం కింద మూడేళ్లలో సామగ్రికి 2400 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని వెల్లడించారు. టెండర్ ప్రక్రియలో ఐదు కంపెనీలు సిండికేట్గా ఏర్పడ్డాయని తెలిపారు. నిధులు దారి మళ్లినట్లు ఎన్ఫోర్స్మెంట్ విచారణలో తేలిందని వెల్లడించారు. గతేడాది ఫ్లాట్ ప్యానెల్స్ కు సంబంధించి నేటికీ డబ్బులు ఇవ్వలేదన్నారు. నాలుగు వందల కోట్ల రూపాయలతో ఫ్లాట్ ప్యానెల్స్ కొనుగోలు పేరిట మరో కుంభకోణం జరిగిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఈ నెల 6న శృంగవరపుకోటలో జరిగిన వైసీపీ బస్సు యాత్రలో మంత్రి పాల్గొన్నారు. ఈ యాత్రలోనే మంత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన మంత్రి బొత్సను విశాఖపట్నంలోని ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు.. గుండెలో మూడు చోట్ల పూడికలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేయాలని సూచించడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మంత్రి బొత్స సత్యనారాయణను చేర్పించగా.. శనివారం వైద్యులు ఆయనకు ఆపరేషన్ చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఈ సర్జరీ జరిగింది. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని, బొత్స సత్యనారాయణ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. నెల రోజుల వరకు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు మంత్రి బొత్స కుటుంబ సభ్యులు తెలిపారు.
తిరుపతి నగర శివారు ప్రాంతాల్లో చెడ్డి గ్యాంగ్ దొంగలు సంచారం కలకలం రేపింది. దీంతో పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని తీల్చారు. రాత్రి సమయంలో ఇంటి తలుపులు తట్టడం, కాలింగ్ బెల్ కొట్టిడం.. వేరే రకమైన శబ్దాలు చేస్తూ ప్రమాదం ఉందని అనిపించినా.. ఎవరు నిర్ధారించుకోకుండా తలుపులు తీయవద్దని పోలీసులు హెచ్చరించారు. కావున ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. వెంటనే డైల్ 100 లేదా… దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించాలని కోరారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి.. పోలీసు యంత్రాంగం తీవ్రమైన కృషి చేస్తుంది.
రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా చంద్రగిరి గుర్తింపు పొందింది చంద్రగిరి నియోజకవర్గంలో దొంగ ఓట్ల కలకలం రేగింది. నియోజకవర్గం పరిధిలో దాదాపు 35 వేల దొంగ ఓట్లను చంద్రగిరి టిడిపి ఇంచార్జీ పులివర్తి నాని గుర్తించారు. టీడీపీ కార్యకర్తలతో కలిసి తిరుపతి తాసిల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. నకిలీ ఫాం 6 ను అప్లై చేసిన వారిని వెంటనే శిక్షించాలంటూ నినాదాలు చేశారు. గుర్తించిన దొంగ ఓట్లను వెంటనే తొలగించాలని పులివర్తి నాని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని నగరాలన్నింటిలో ఆహ్లాదకరమైన పార్క్ లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గుంటూరులో ఎంపి అయోధ్య రామిరెడ్డి, ప్రభుత్వ విప్ లేళ్ళ అప్పిరెడ్డి, తదితర ముఖ్య నేతలతో కలిసి రూ.6.25 కోట్లతో అభివృద్ధి చేసిన నగరపాలక సంస్థ గాంధీ పార్క్ ను పునః ప్రారంభం చేశారు.
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మానసిక ఒత్తిడి, వాతావరణ కాలుష్యం నుండి పచ్చదనం ప్రశాంతతని అందించడంలో పార్క్ లు ప్రధాన పాత్ర పోషిస్తాయని, గాంధీ పార్క్ అభివృద్ధి ద్వారా గుంటూరు నగర ప్రజలకు ఆహ్లాదం అందేలా నగరపాలక సంస్థ చర్యలు తీసుకుందన్నారు. మారుతున్న ప్రస్తుత కాలానికి తగిన విధంగా పిల్లలకు ఎడ్యుకేటివ్ గా పార్క్ ని తీర్చిదిద్దారన్నారు.
పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెం గ్రామంలో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పై అంబటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మా వాళ్లు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనుకుంటారు. పవన్ కళ్యాణ్ సూట్ కేసులు తీసుకొని చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలనుకుంటాడన్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో బిజెపికి ,ఏపీ లో తెలుగుదేశం పార్టీ కి సపోర్ట్ చేస్తారన్నారు . అక్కడ అలా ఇక్కడ ఇలా ఏమిటో ఎవరికి అర్థం కాదు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటాడో తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఎద్దేవా చేశారు అంబటి.