ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ శైవక్షేత్రాలను పంచారామాలు అని పిలుస్తారు. పంచారామాలు ఏర్పడుటకు స్కంద పురాణంలో వాటి స్ధల పురాణం ఇలా వివరించబడినది.పూర్వం తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి శివుని ఆత్మలింగము సంపాదిస్తాడు.దీనితో వర గర్వముతో దేవతలను అనేక రకాలుగా హింసలు గురిచేయగా దీనితో దేవతలు విష్ణుమూర్తిని ప్రార్ధించగా శివపార్వతుల వల్ల కలిగిన కుమారుడు వల్లనే తారకాసురునిపై యుద్ధానికి పంపుతారు.యుద్ధమునందు కుమారస్వామి తారకాసురుని కంఠంలో గల ఆత్మలింగమును చేదిస్తేనే మరణము కలుగునని గ్రహించి ఆ లింగమును చేదిస్తాడు.దీనితో తారకాసురుడు మరణిస్తాడు.చేదించగా ఆ ఆత్మలింగము వేరై ఐదు ప్రదేశములలో పడుతుంది. తరువాత వాటిని ఆఅ ప్రదేశాలలో దేవతలు ప్రతిష్ఠ ఛేస్తారు. ఇవే పంచారామాలు. దాక్షారామము పంచరామాల్లో మొదటిదైన దాక్షారామము తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఉంది. ఇక్కడ స్వామిని భీమేశ్వరుడు అని పిలుస్తారు.స్వామి లింగాకారం 60 అడుగులు ఎత్తులో ఉంటుంది. పైఅంతస్తు నుండి పూజలు నిర్వహించాలి.ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి లింగాకారం సగం భాగం తెలుపు సగభాగం నలుపుతో ఉంటుంది. ఇక్కడ దక్షప్రజాపతి యజ్ఞం నిర్వహించాడు. కనుక ఈ ప్రాంతానికి దాక్షారామము అని పేరు వచ్చిందంటారు. ఈ ఆలయం చాళుక్యరాజయిన భీముడు నిర్మించాడని తెలుస్తుంది.అనేక పురాణాల్లో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది. పూర్వకాలంలో ఎంతోమంది దేవతలు,రాజులు స్వామి వారిని దర్శించి తరించారని తన భీమేశ్వర పురాణంలో రాసాడు.ఈ ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉంటుంది.ఇక్కడ మహాశివరాత్రి పర్వదినం కన్నుల పండుగగా నిర్వహిస్తారు. అమరారామము పంచారామల్లో రెండవదైన అమరారామము గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణా తీరమునందు కలదు.ఇక్కడ స్వామిని అమరేశ్వరుడు అని పిలుస్తారు.గర్భగుడిలో స్వామి విగ్రహం 9 అడుగుల ఎత్తులో తెల్లగా మెరుస్తూ ఉంటుంది.ఈ ఆలయం 20 అడుగుల ఎత్తుగల విశాలమైన వేదికపైన నిర్మించబడింది. గర్భగుడిలోని విగ్రహాన్ని తారకాసురుని సమ్హారం అనంతరం కంఠంలోని శివుని ఆత్మలింగం చెల్లాచెదురు అవ్వగా దానిలోని ఒభాగాన్ని అమరేశ్వరుడైన ఇంద్రుడు ఇక్కడ ప్రతిష్టించి తన నగరమైన అమరావతినే దీనికి పెట్టాడంటారు. క్షీరారామము పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో కలదు. ఇక్కడ శివుని మూర్తిని శ్రీ క్షీరారామ లింగేశ్వర స్వామి అని పిలుస్తారు. ఇక్కడ స్వామి వారిని త్రేతాయుగ కాలంలో సీతారాములు ఇద్దరూ ప్రతిష్ఠించారట.ఈ గ్రామానికి పాలకొల్లు అని పేరు రావడానికి కూడా ఒక కధ ఉంది. శివుడు తన బాణమును భూమిలోనికి వెయ్యగానే భూమినుండి పాలదార ఒకటి వచ్చిందట క్షీరం అనగా పాలు దీనిమూలంగా క్షీరపురి అనే పేరు వచ్చింది.క్రమంగా క్షీరపురి కాస్తా పాలకొల్లుగా మార్పు చెందింది. స్వామి వారి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు.ఆలయం 125 అడుగుల ఎత్తులో 9 గోపురాలుతో కట్టబడింది. సోమారామము పంచరామాల్లో నాల్గవదైన సోమారామము పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి రెండు కిలోమిటర్లు దూరంలో గల గునిపూడిలో కలదు. ఇక్కడ స్వామి వారిని సోమేశ్వరుడు అని పిలుస్తారు.ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది.మాములు రోజుల్లో తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజు వచ్చేసరికి గోధుమ రంగులోనికి మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యధాస్ధానానికి చేరుతుంది. ఇక్కడ స్వామిని చంద్రుడు ప్రతిష్టించాడు.చంద్రునిచే ప్రతిష్ఠించ బడినది కావున దీనికి సోమారామము అని పేరు వచ్చింది. కుమార భీమారామము పంచారామాల్లో చివరిదైన కుమారభీమారామము తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమిటరు దూరంలో కలదు.ఇక్కడ స్వామిని కాల బైరవుడు అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని దాక్షారామాన్ని నిర్మించిన చాళుక్య రాజయిన భీముచే ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడు. ఇక్కడి శివలింగం సున్నపురాయితో చెయ్యబడింది.ఈ ఆలయంలో మహశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.
#AndhraPradesh #
తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు వస్తుందని ఆశ చూపి వచ్చిన బోర్డు తిప్పేసిన 9fx గ్లోబల్ ట్రెండింగ్ సభ్యుల గుట్టురట్టు చేసిన రాయచోటి పోలీసులు. రాయచోటి డిఎస్పీ కార్యాలయం నందు అర్బన్ సీఐ సుధాకర్ రెడ్డి తో కలిసి డిఎస్పీ మహబూబ్ బాషా మీడియా సమావేశం. 9 యాఫ్ యక్స్ గ్లోబల్ ట్రెండింగ్ గ్రూప్ సభ్యులను అరెస్ట్ చేసిన రాయచోటి పోలీసులు. రసూల్ సాహెబ్,యోగనంద చౌదరిలు ఇద్దరు క 2019 లో 9 యాఫ్ యక్స్ గ్లోబల్ ట్రెండింగ్ యాప్ ను ప్రారంభించారు. వీరికి రాయచోటి కి చెందిన సుబ్బారెడ్డి ద్వారా తిరుపాల్ రెడ్డి పరిచయం అయ్యాడు. రాయచోటి,కడప, నెల్లూరు రాజేష్,చంద్ర మౌళిశ్వర రెడ్డి,మల్లికార్జున ల ద్వారా ఆయా ప్రాంతాలలో బ్రాంచ్ లు ఏర్పాటు చేసి వీరిని డైరెక్టర్లుగా నియమించారు. వీరి కింద 302 మంది ఏజెంట్లను నియమించి వారి ద్వారా సుమారు 1759 మంది దగ్గర ఇందులో పెట్టుబడులు పెట్టించారు. 1759 సభ్యులు ఈ కంపెనీలో రు.170 కోట్లు నగదును డిపాజిట్ చేయడం జరిగింది. వచ్చిన డబ్బులను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అందులో వచ్చే లాభం ద్వారా గ్రూప్ సభ్యులకు చెల్లించాలన్నది ఈ యాప్ యొక్క ఉద్దేశం. డబ్బులు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అనువైన భూములు దొరకలేదు. దీంతో వచ్చిన నగదు కన్నా చెల్లించాల్సిన డబ్బు ఎక్కువైంది. పెట్టుబడుదారులకు సుమారు రు.105 కోట్లు,ప్రమోటర్లకు వివద రకాల కమిషన్ రూపంలో రు.65 కోట్లు చెల్లించడం జరిగింది. 2022 అక్టోబర్ నెలలో అన్ని ప్రాంతాలలో నున్న బ్రాంచ్ కార్యాలయాలు మూతపడ్డాయి. 2023 ఎప్రైల్ నెలలో గోల్డెన్ ఫార్మర్స్ డవలపర్ pvt.ltd అనే రియల్ ఎస్టేట్ పేరున రిజిస్టర్ చేయించి రాజేష్, చంద్రమౌళిశ్వర ల ఇద్దరినీ డైరెక్టర్లుగా నియమించారు. నెల్లూరు జిల్లా దత్తలుర్ మండలం నందిపాడు వద్ద 22 ఎకరాలు అనిల్ కుమార్ పేరున రిజిస్టర్ చేయించి అందులో అందులో శాండిల్ వుడ్ చెట్లు వేసి,ప్లాట్లు గా వేసి వాటి ద్వారా వచ్చే డబ్బును మిగితా సభ్యులకు చెల్లించాలనుకొన్నరు. నష్టపోయిన బాధితులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి యాప్ ప్రారంభించిన వారితో పాటు ఆరు మందిని అరెస్ట్ చేశాం. అరెస్ట్ చేసిన వారి పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు వివరాలు వెల్లడించిన డిఎస్పీ మహబూబ్ బాష .
జగ్గయ్యపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం శ్రీ రఘురాం, ఇన్చార్జి శ్రీరాం రాజగోపాల్ తాతయ్య NTR జిల్లా జగ్గయ్యపేట మండలం లోని పత్తి, మిర్చి, వరి తదితర పంటల సాగుచేసిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్న టీడిపి నేతలు విత్తనం దగ్గర నుంచి ఎరువులు, మందులు, నాట్లు, కలుపులు తీసి వరికి 40వేలు, పత్తికి 50వేలు, మిర్చికి లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టి చివరకు సాగునీరు అందక నానా ఇబ్బందులు పడుతున్న రైతులను ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకోని ప్రభుత్వం, ప్రకృతి వైపరీత్యాల క్రింద నిధిని ఏర్పాటు చేస్తామని, పంటల భీమా పథకాన్ని కల్పిస్తామని ఎన్నికల ముందు వాగ్దానం విస్మరించి కనీసం రైతులకు సాగునీరు అందించలేని, ఈ ప్రభుత్వం విధానాలను ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం శ్రీ రఘురామ్, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి శ్రీరాం రాజగోపాల్ తాతయ్య రైతు సంఘం నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి జగ్గయ్యపేట మండలంలో రెడ్డి నాయక్ తండా, అన్నవరం గ్రామాలలో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలన. నెట్టెం శ్రీ రఘురాం మాట్లాడుతూ రైతుల ఆందోళనను వైయస్సార్ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. రెడ్డినాయక్ తండాలో 40 సంవత్సరాల క్రితం ఉన్న స్కీం పట్టించుకోకుండా సాగునీరు అందకపోవడం వల్ల జగ్గయ్యపేట మండలంలో సుమారు వరి 200 ఎకరాల్లో మిరప 150 ఎకరాల సుమారు పంట ఎండిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇంకా ఇతర పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. మోటర్లు పెట్టి సాగునీరు పంట పొలాలకు ఇవ్వాలన్నా సరిపడా కరెంటు ఇవ్వలేని పరిస్థితిలో వైసిపి ప్రభుత్వం ఉంది. మొన్న క్యాబినెట్ సమావేశంలో కనీసం రైతుల గురించి ఆలోచించని జగన్ ప్రభుత్వం రైతులను కల్లబొల్లి మాటలతో మోసం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వారి తాబేదారులకు లంచం చేకూర్చడంలో ఉన్న ఉత్సాహంలో 10% అయినా రైతులుపై పెట్టాలి. జగ్గయ్యపేట మండలంలో జరిగిన పంట నష్టాన్ని అధికారులు వెంటనే సర్వే చేసి వారికి పంట నష్టం చెల్లించాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తాతయ్య మాట్లాడుతూ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్ల రైతులకు కంట కన్నీరు మిగిలింది. మిర్చి, వరికి రైతులు పెట్టుబడి పెట్టి నీరంధక నష్టపోయారన్నారు. చంద్రబాబు నాయుడు హాయంలో ముక్త్యాల స్కీమ్ శంకుస్థాపన చేసి రైతులకు సాగునీరు అందించాలని కృషి చేస్తే, ఈ ప్రభుత్వం స్కీం స్థలాన్ని వేదాద్రి కి మార్చి పనులు ఆపు వేయడం వల్ల రైతులు సాగునీటికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వంలో కంచెల-వేదాద్రి స్కీం ఆగిపోవడం జరిగింది. బూదవాడలో నెట్టెం రఘురాం హాయంలో స్కీమ్ ఏర్పాటు చేశారు. నిధులు లేవని వంకచూపి వైసిపి ప్రభుత్వం స్కీం ఆపివేయడం జరిగిందన్నారు. నిర్లక్ష్యం, సరైన ఆలోచన లేకపోవడం వల్ల రైతులు తీవ్ర నష్టం చవిచూస్తున్నారు. జగ్గయ్యపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను పూర్తిగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్.
కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ టిడిపి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి మీడియా సమావేశం. బస్సు యాత్రకు వ్యతిరేకంగా టిడిపి నాయకులు నిరసన తెలిపితే బస్సు చక్రాలక్రింద తొక్కుకుంటూ పోతాము అన్న అనీల్ కుమార్ యాదవ్ వ్యాఖ్య అభ్యంతరకరంగా ఉన్నాయి. అనీల్ కుమార్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యం లో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంది. ఇప్పటి వరకు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కన్నబాబు గాని మేము కాని ఎప్పుడూ వ్యక్తి గతం గాను, అభ్యంతరకరంగా విమర్శలు చేసుకోలేదు. అనీల్ కుమార్ యాదవ్ మాట్లాడిన మాటలు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు కి ఇబ్బందికరం. నెల్లూరు జిల్లాలో ఎంత మందిని ఈయన బస్సులు పెట్టి తొక్కించేసాడో. అనీల్ కుమార్ వ్యాఖ్యలు ఎంత వరకు సమంజసమో స్ధానిక ఎమ్మెల్యే కన్నబాబు విచక్షణకే వదిలి పెడుతున్నాము. బిసి ఎస్సీ ఎస్టీ లకు జగన్ చేసింది ఏమీ లేదు. బిసి, ఎస్సీ, ఎస్టీలకు మహిళలకు సామాజిక న్యాయం చేసింది టిడిపి వ్యవస్ధాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు మాత్రమే. టిడిపి లో బిసి లకు మహిళలకు సరైన గుర్తింపు ఇచ్చారు కాబట్టే నేను ఒకసారి ZPTCగాను, రెండు సార్లు ఎమ్మెల్యేగాను, రెండు సంవత్సరాలు టిటిడి బోర్డు మెంబర్ గాను పనిచేసాను.
ఏపీ దొంగ ఓట్లపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. అయితే విచారణ సందర్భంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. గతంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన నేపథ్యంలో విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఏపీలో దొంగ ఓట్లపై మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆధ్వర్యంలోని సిటిజెన్స్ ఫర్ డెమొక్రసీ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఐప్యాక్ మాజీ ఉద్యోగుల చేత దొంగ ఓట్లు చేర్చుతున్నారని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆ పిటిషన్లో ఆరోపించారు. ర్యామ్ ఇన్ఫో లిమిటెడ్, ఉపాధి టెక్నో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, మ్యాక్ డిటెక్టివ్ అండ్ గార్డింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు వలంటీర్ల ద్వారా సేకరించిన డేటాను ఫ్రొపైలింగ్ చేస్తున్నాయని పిటీషన్లో ఆరోపించారు. ఈ సంస్థలకు రూ.68కోట్లు ప్రజాధనాన్ని వెచ్చించినట్లు పిటిషన్లో నిమ్మగడ్డ ఆరోపించారు. ఈ మేరకు ఐ ప్యాక్ మాజీ ఉద్యోగుల నిర్వాకాన్ని బట్టబయలు చేసింది. ఏపీలో దొంగ ఓట్లపై మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆధ్వర్యంలోని సిటిజెన్స్ ఫర్ డెమొక్రసీ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇప్పటికే విచారణ జరిపిన ధర్మాసనం తదుపరి విచారణను నవంబర్ 7కు వాయిదా వేసింది. దీంతో మంగళవారం ఈ కేసు విచారణ ప్రారంభమైంది. అయితే ఈ కేసు విచారణ ప్రారంభం కాకముందే తాను ఈ కేసు నుంచి తప్పుకుంటున్నట్లు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రకటించారు. గతంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినందున ఈ కేసు విచారణనుంచి తప్పకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో సీజేఐ ఆదేశాలతో మరో ధర్మాసనం ముందు లిస్ట్ చేయాలని రిజిస్ట్రీకి జస్టిస్ బిఆర్ గవాయి సూచించారు. ఇకపోతే ఓటర్ల నమోదులో ఏపీ ప్రభుత్వం యధేచ్చగా జోక్యం చేసుకుంటోదంటూ సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ ఆరోపించింది. ఓటర్ల నమోదులో గ్రామ, వార్డు వాలంటీర్లు, కార్యదర్శులను భాగస్వాములను చేయడంపైనా సిటిజెన్స్ ఫర్ డెమొక్రసీ అభ్యంతరం వ్యక్తం చేసింది
ఏపీలో మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. పశ్చిమ వాయువ్యంగా పయనించి అరేబియా సముద్రంలో ప్రవేశించనుంది. ఈ ప్రభావంతో నవంబర్ 8 న ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని కారణంగా ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా మారి.. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, తిరుపతి, కడప జిల్లాల్లో భారీ వానలు కురుస్తాయంటున్నారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల జల్లులు, మబ్బు వాతావరణం ఉంటుంది అంటున్నారు. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల జల్లులు, మబ్బుగా ఉంటుందని వాతవరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
మంగళగిరి మండలం నిడమర్రులో రోడ్ల నిర్మాణం వెంటనే నిలిపివేయాలని నగరపాలక సంస్థతోపాటు, సీఆర్డీఏను హైకోర్టు ఆదేశించింది. అమరావతి మాస్టర్‌ప్లాన్‌కు విరుద్ధంగా రోడ్లు వేస్తున్నారంటూ అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, అనుమతి తీసుకోకుండా నిడమర్రులో తమకు కేటాయించిన ప్లాట్లలో అధికారులు రోడ్లు వేస్తున్నారంటూ అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. రైతుల తరఫున న్యాయవాది లక్ష్మీనారాయణ లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వెంటనే నిర్మాణ పనులను ఆపేయాలని అధికారులను ఆదేశించింది. రైతులకు నోటీసులు ఇచ్చి వారి వాదనలు వినాలని ఆదేశించింది.
శ్రీకాకుళం జిల్లా పలాస లో సామాజిక సాధికారిక యాత్ర లో స్పీకర్ తమ్మినేని సీతారాం కామెంట్స్ పేదరికం, విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమానికి అడ్డు రాకూడదు. నాలుగేళ్లలో పేదల కు అండగా ఉండి పథకాలు అందించడం జరిగింది. పేదవాడు నేడు తలెత్తి దైర్యం గా బతికేలా చేశాం. విద్య లో ఇంగ్లిష్ మీడియం వద్దని కొందరు కోర్టు కి వెళ్లారు. కానీ వారి పిల్లలు ఇంగ్లీష్ మీడియం లో చదువుకోవాలి పేద వారికి ఇంగ్లీష్ వద్దు అన్నారు కొందరు. పలాస లాంటి ప్రాంత వాసి కి ఇంగ్లిష్ వస్తే ఇంటర్వ్యూ దైర్యం గా ఫేస్ చేయగలరు. వైద్యం పై లక్షలు వెచ్చించి పేదలకు పైసా ఖర్చు లేకుండా చేస్తున్నాము. పిల్లలు జగన్ మామ అంటున్నారు. ఆరోగ్యశ్రీలోనే వేగంగా ఆపరేషన్లు అవుతున్నాయి. హైదరాబాద్ అయినా విజయవాడ అయినా ఆరోగ్యశ్రీ పేరున ఆపరేషన్ జరుగుతున్నాయి. పేదల ఇంటిలోకి వెళితే దేవుళ్ళుగా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉన్నాయి వాళ్లే మా దేవుళ్ళు అంటున్నారు. రాష్ట్రంలో గతంలో సామాజిక వర్గాల్ని అట్టడుగు కు వుండేవి. జగన్ వచ్చాకే సామాజిక వర్గాలన్నీ లేచి నిలబడ్డాయి. జగన్ వల్ల సామాజిక సాధికారిక యాత్ర వల్ల మన సామాజిక విజయ శంఖారావం మ్రోగింది. ఇప్పుడు జరుగుతుంది పెత్తందారి సామాజిక వర్గాల యుద్ధం. ఈ యుద్ధంలో మనం గెలవాలి. మనం గెలవాలంటే బ్యాలెట్ యుద్ధంలో జగన్ గెలిపించాలి. ఇది మన ఆత్మగౌరవ యాత్ర మనం తలెత్తుకు తిరిగే పరిస్థితి జగన్ కల్పించారు. జగన్ బటన్ నొక్కితే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. గతంలో జన్మ భూమి కమిటీ లాగ లంచాలు లేవు కుల ,, మత,పార్టీ బేధం లేదు అందరికీ అందించాం.
ఎన్నికలు వచ్చేసరికి తెలంగాణ లో మంత్రులు ఏది పడితే అది మాట్లాడుతున్నారని దానిని ప్రజలు పట్టించుకోవద్దన్నారు మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి. గతంలో ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం పెంక్షన్ ల విషయంలో కొనియాడిందని చెప్పారు. గుంటూరు జి డి సి.సి బ్యాంక్ మైక్రో ATM ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి కాకాని వచ్చారు. పార్టీ పెట్టి ఎవరికో ఓట్లు వేయమనే పార్టీలని తాము పట్టించుకోమని పవన్ కళ్యాణ్ పై సెటైర్లు విసిరారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా తాము ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోసం భక్తులు తిరుమల పాదయాత్ర చేపట్టారు. పెనుకొండ నియోజకవర్గం సోమందెపల్లి మండల కేంద్రం నుండి శనివారం 100 మంది పైగ భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ తిరుమలకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం పాదయాత్రగా తిరుమలకు పయనమయ్యారు.
Read Also..
Read Also..