ఛత్తీస్ఘడ్ లో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరియు CRPF DIG ముందు 25 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ మావోయిస్టులపై మొత్తం 29 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. లొంగిపోయిన నక్సలైట్లు గంగ్లూర్ , బైరామ్గఢ్ ఏరియా కమిటీల్లో క్రియాశీలకంగా పని చేశారని జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. ఇద్దరు మహిళా నక్సలైట్ లు కూడా లొంగిపోయినవారిలో ఉన్నారు. మావోయిస్టు భావజాలం పట్ల నిరాశ, ఉద్యమ నేతల దౌర్జన్యాల కారణంగా వీరు లొంగిపోయినట్లు ఎస్పీ చెప్పారు.ఛత్తీస్ ఘడ్ లో 25 మంది మావోయిస్టులు లొంగుబాటు. లొంగిపోయిన వీరికి రూ.25వేల చొప్పున సాయంతో పాటు ప్రభుత్వ పాలసీ ప్రకారం పునరావాసాన్ని కల్పిస్తామని ఎస్పీ తెలిపారు. బీజాపూర్ జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకూ 346 మంది నక్సలైట్ లను అరెస్టు చేయగా, 170 మంది లొంగిపోయారని ఆయన తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
- ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భారత్ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్కు వస్తున్న జిన్పింగ్ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్పింగ్తో పాటు…
- ప్యారడైజ్ నా కెరీర్లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా.ప్యారడైజ్ నా కెరీర్లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా. సెప్టెంబర్ 24న వస్తున్నాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అడ్రినలిన్ పంపింగ్ హై ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సినిమా అంతా హైలెట్గా ఉంటుంది: ప్రెస్ మీట్లో న్యాచురల్ స్టార్ నాని న్యాచురల్ స్టార్…
- ఆర్మీ వెపన్స్ చోరీ కేసులో షాకింగ్ ట్విస్ట్.బొల్లారం మిలటరీ కంపౌండ్ మద్రాసు రెజిమెంట్ యూనిట్ నుంచి మిస్సింగ్ అయిన గన్స్ చోరీ వెనకాల 12 ఏళ్ల పాటు మిలటరీలో పని చేసి బయటికి వచ్చిన ఓ ఉద్యోగి ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


