వైసీపీ మేనిఫెస్టోలో పాత హామీలు కొనసాగించటమంటే… అరాచకాలు కొనసాగుతాయని చెప్పటమేనని గుంటూరు లోక్ సభ తెదేపా అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) వ్యాఖ్యానించారు. ఈసారి జగన్ గెలిస్తే రాజధాని ఉండదు, పోలవరం ఉండదు, గంజాయి అమ్మాకాలు మాత్రం ఉంటాయని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గుంటూరు పశ్ఛిమ నియోజకవర్గం అభ్యర్థి పిడుగురాళ్ల మాధవితో కలిసి అపార్ట్ మెంట్ వాసులతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పెమ్మసాని జగన్ ను ఓడించటానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమని… వైసీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్య చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇంకా అమరావతిని ఒక వర్గానిదని ముద్ర వేసే ప్రయత్నాలను తిప్పికొట్టారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రెండు డీఏలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏలను సెప్టెంబరు నెల జీతంతో కలిపి చెల్లించాలని ఆదేశించింది. 2025 జనవరి 1 నుంచి 1.82 శాతం…
- ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో…