టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 27న ఢిల్లీకి వెళుతున్నారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్‌కు ఆయన హాజరవుతారు. ఆయన వెంట సతీమణి భువనేశ్వరి ఉంటారు. చంద్రబాబు సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరుకుంటారు. అదే రోజు రాత్రి ఢిల్లీలోని ఒక హోటల్లో జరిగే రిసెప్షన్‌కు హాజరవుతారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీ నుంచి బయల్దేరి హైదరాబాద్‌కు చేరుకుంటారు.
Tdp
ప్రకాశం జిల్లా మార్కాపురంలో టీడిపి మాజి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సమక్షంలో 50 కుటుంబాలు పార్టీలోకి చేరాయి. స్థానిక మున్సిపాలిటీ కి చెందిన 14వ వార్డ్ లో టీడిపి లోకి భారీగా వలసలు. సుమారు 100 కుటుంబాలు వైసీపీని వీడి టీడిపి లోకి చేరినట్లుగా తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కందుల మాట్లాడుతూ సీఎం జగన్ అసమర్థ పాలన నచ్చక టీడిపి లోకి చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా పామిడి పట్టణం మరియు గ్రామీణ ప్రాంతాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వము అందిస్తున్న సంక్షేమ పథకాలను, ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి మాట అమలు చేయడంతో ఆకర్షితులై గత 40 సంవత్సరాలుగా టిడిపి పార్టీలో ఉంటున్న సుమారు 100 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పామిడి పట్టణంలోని 4,5,9,18,19 వార్డులందు పామిడి స్టేషన్ మరియు కొత్తపల్లికి చెందిన వంద టీడీపీ కుటుంబాలు గుంతకల్లు ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా టిడిపి పార్టీలో ఉంటూ పార్టీకి ఊడిగం చేశామని కానీ మమ్మల్ని పార్టీ పట్టించుకోలేదన్నారు. దీంతో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు.
ఏపీ రాజధానిని విశాఖకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. పలు శాఖల మంత్రులు, కార్యదర్శులు, ఉన్నతాధికారుల కార్యాలయాలకు విశాఖలో భవనాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన పనులు జరిగిపోతున్నాయి. విశాఖకు పాలనా రాజధానిని మారుస్తున్నట్టు ఏ క్షణంలోనైనా ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ విశాఖకు ఎందుకు వస్తున్నారు? దేని కోసం వస్తున్నారని గంటా ప్రశ్నించారు. అడ్డదారిలో విశాఖకు రావాల్సిన అవసరం ఏముందని అడిగారు. ఇందులో రాజకీయ లబ్ధి తప్ప, ప్రజలకు ఉపయోగపడేదేమీ లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోబోతోందని ఈ 3 నెలల ముచ్చట కోసం ప్రజాధనాన్ని తగలేస్తున్నారని విమర్శించారు. విశాఖలో పులివెందుల పంచాయితీలు నడుస్తున్నాయని దుయ్యబట్టారు. విశాఖ ప్రజల ఆవేదన వైసీపీకి పట్టడం లేదని అన్నారు.
రాష్ట్రంలోని ఇసుకను దోచేస్తున్నారంటూ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. తమ్ముడి కోసం కోల్ కతా కేంద్రంగా రహస్యంగా ఇసుక టెండర్లు వేయించారని ఆరోపించారు. రాష్ట్రంలోని మొత్తం ఇసుకను పక్క రాష్ట్రాల అస్మదీయులకు అప్పగించారని విమర్శించారు. అనుభవం లేని కంపెనీలకు బిడ్లను ఖరారు చేశారని దుయ్యబట్టారు. టెండర్లు ఖరారు కాకముందే నెల రోజుల క్రితమే దోపిడీ మొదలయిందని అన్నారు. శాండ్, ల్యాండ్, వైన్, మైన్ లలో సెంట్రలైజ్డ్ దోపిడీకి పాల్పడుతున్నారని చెప్పారు. ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వడం నేరమంటూ చంద్రబాబుపై కేసు పెట్టిన జగన్ రెడ్డి 53 నెలల్లో రాష్ట్రాన్ని గంపగుత్తగా దోచేశారని మండిపడ్డారు.
Read Also..
Read Also..
తెలుగుదేశం పార్టీ దోపిడీ గురించి మాట్లాడుతుంటే గజదొంగే దొంగ..దొంగ అని అరిచినట్లు ఉంది అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. మేఘా కంపెనీ ప్రభుత్వ గ్యారెంటీతో 2 వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుందని టీడీపీ చేసిన ఆరోపణలు ముమ్మాటికి అబద్దం అన్నారు. గ్యారంటీ లెటర్ అంటే ఏంటో కనీస అవగాహన లేకుండా మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. స్కిల్ డెవలప్ మెంట్లో 241 కోట్ల రూపాయలు దోచుకుందెవరు? రాజధాని అమరావతి పేరుతో వేల కోట్లు సంపాదించిందెవరు? అని బుగ్గన నిలదీశారు. ఇన్నర్ రింగ్ రోడ్డుని మెలికలు తిప్పి అక్రమాలకు పాల్పడిందెవరు? సామాన్య ప్రజలలో వైసీపీ ప్రభుత్వ సంక్షేమ విధానాలు, పరిపాలన మీద ఉన్న అభిమానాన్ని, నమ్మకాన్ని దెబ్బతీయాలనే కుట్రతో ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వ గ్యారంటీ అని మా మీద బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారని ప్రజలకు స్పష్టమవుతుంది అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ బండి కి జాకీలు వేసి బిజెపి, జనసేన పార్టీలు తిరిగి తెలుగుదేశం పార్టీకి జీవం పోయడానికి ప్రయత్నిస్తున్నాయని. ఇందులో భాగంగా బిజెపి నాయకులు భాను ప్రకాష్ రెడ్డి తిరుపతి అభివృద్ధి కోసం కేటాయించాలనుకుంటుంన్న శ్రీవారి ఒక శాతం నిధులను వ్యతిరేకించడం లోనే అంతరార్థం బయట పడింది అని వైసీపీ నేతలు ముద్ర నారాయణ, బాలిశెట్టి కిషోర్, వాసు యాదవ్, దొడ్డ రెడ్డి మురళి తదితరులు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ గత చరిత్రలో భాను ప్రకాష్ రెడ్డి కౌన్సిలర్ గా, టీటీడీ బోర్డు మెంబర్ గా పనిచేసిన కాలంలో కమిషన్ లేనిదే పనిచేయ డన్న కీర్తిని గడించారన్నారు. దీనిని బట్టి చూస్తే నేడు ఎంత సంపాదించడానికి ఒక శాతం నిధులకు అడ్డుపడుతున్నాడని అనుమాన వ్యక్తం చేశారు. దీనివలన ప్రత్యక్షంగా కారు తదితర ప్రైవేటు వాహనాల కార్మికులు, పరోక్షంగా తిరుపతి ప్రజలు, భక్తులు, ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భానుకు కళ్ళు తెరిపించాలని వెంకన్నను వేడుకుంటున్నాము అన్నారు.
Read Also…
Read Also…
మద్యం కేసులో టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. మద్యం కేసులో వాదనలు ముగిశాయి. ఈ రోజు సీఐడీ తరపున AG వాదనలు వినిపించగా, చంద్రబాబు తరపున రిప్లై వాదనలు పూర్తయ్యాయి. సోమవారం లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సోమవారం లిఖిత పూర్వక వాదనలు అనంతరం హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కొల్లు రవీంద్ర తరపున కూడా వాదనలు పూర్తయ్యాయి. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.
Read Also..
Read Also..
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పరిణామాల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిచిపోయిన నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ఈ నెల 27న పున:ప్రారంభం కానుంది. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించడంతో పాదయాత్రను తిరిగి కొనసాగించాలని లోకేశ్ నిర్ణయించుకున్నారు. చంద్రబాబు అరెస్టు కారణంగా సెప్టెంబరు 9న పాదయాత్రకు బ్రేక్ ప్రకటించిన కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడ నుంచి తిరిగి ప్రారంభం కానుంది. అయితే ముందుగా నిర్దేశించుకున్నట్టుగా యువగళం యాత్ర ఇచ్చాపురం వరకు కొనసాగదు. డిసెంబర్ చివరిలో విశాఖపట్నంలోనే ముగియనుంది. దాదాపు రెండున్నర నెలలపాటు విరామం రావడం, మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విశాఖపట్నంలో ముగించాలని లోకేశ్ నిర్ణయించుకున్నారు. 27న పున:ప్రారంభమై రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ పట్టణ, కాకినాడ గ్రామీణ, పిఠాపురం, తుని నియోజకవర్గాల మీదుగా అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. కొన్ని నియోజకవర్గాల మీదుగా విశాఖపట్నం చేరుకున్నాక అక్కడ పాదయాత్రను ముగించనున్నారు. ఇందుకు తగ్గట్టు రూట్ మ్యాప్‌ను పార్టీ వర్గాలు రూపొందిస్తున్నాయి. 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని లోకేశ్ భావించారు. జనవరి 27న కుప్పంలో మొదలుపెట్టారు. అయితే చంద్రబాబు అరెస్ట్ పర్యవసనాల నేపథ్యంలో దాదాపు రెండున్నర నెలలపాటు అంతరాయం ఏర్పడింది. తాత్కాలిక విరామం ప్రకటించే సమయానికి 208 రోజుల్లో 2,852.4 కిలోమీటర్లు పూర్తయ్యింది. 84 నియోజకవర్గాల గుండా ఈ యాత్ర కొనసాగింది. పెద్ద సంఖ్యలో బహిరంగ సభలతోపాటు యువత, మహిళలు, రైతులు, ముస్లింలు, వివిధ వర్గాలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ లోకేశ్ యాత్రను కొనసాగించారు. ఇదిలావుండగా గతంలో చంద్రబాబు చేపట్టిన ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర కూడా విశాఖపట్నంలోనే ముగిసిందని టీడీపీ నేతలు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు లోకేశ్ పాదయాత్ర కూడా అక్కడే ముగియనుందని, ఈ మేరకు రూట్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నట్టు చెబుతున్నారు.
Read Also..
Read Also..