యువగళం పాదయాత్ర 2.0 అంటూ ప్రకటన వచ్చింది కదా అధికార వైఎస్సార్సీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. పాదయాత్రకు ఊహించని రీతిలో జనం తరలి వస్తున్నారు. మొదట్లో ఈ పాదయాత్రను వైఎస్ఆర్ సీపీ తేలిగ్గా తీసుకోగా, ప్రతి చోటా యువగళంలో కనిపిస్తున్న స్పందన చూసి అధికార పార్టీ నేతలు బాగా కంగారు పడుతున్నారు. అందుకు తగ్గట్లుగా యాత్రకు ఎన్ని అడ్డంకులు వచ్చేలా చేశారో లెక్కేలేదు.ప్రస్తుతం నడుస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్రలో ఆ ప్రభావం స్పష్టంగా కనపడుతోంది. పైగా యువగళం 2.0 పాదయాత్రలో నారా లోకేశ్ ప్రస్తావించే ప్రధాన అంశం.. చంద్రబాబు అక్రమ అరెస్టు గురించే ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ కక్ష్యసాధింపు తీరును ఈ యాత్ర ద్వారా మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తారు. జనాదరణ కూడా గతంలో కంటే మరింతగా ఉంటుంది. ఈ పరిణామాలు ఊహించుకొనే ప్రస్తుతం వైఎస్ఆర్ సీపీ నేతలు టెన్షన్ పడుతున్నట్లుగా సమాచారం. యువగళం సాగే ప్రాంతాల్లోని నేతలకు దానికి అడ్డంకులు సృష్టించాలని అధిష్ఠానం నుంచి ఆదేశాలు అందాయని కూడా సమాచారం
Tdp
వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాజీ మంత్రి ఉమ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మైలవరం వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం జనసేన టీడీపీ పొత్తు నేపద్యంలో మాజీ మంత్రి ఉమ కంటే జనసేన పార్టీ నేత అక్కల గాంధీనే తమకు బలమైన ప్రత్యర్థి అని వ్యాఖ్యానించారు. మునేటి ప్రమాదంలో మరణించిన వారు మా కుటుంబానికి సన్నిహితులని గత 50 సంవత్సరాలుగా వారి కుటుంబాలతో మాకు అనుబందం ఉందని శవాల మీద పేలాలు ఏరుకునే ఉమా వారి నేపద్యం అవసరం లేకుండానే ఏటి వద్ద ధర్నా చేసి వారి చావులకు నేనే బాద్యున్ని అంటూ అసభ్యంగా ఆరోపణలు చేశారన్నారు. అన్నా క్యాంటీన్లలో బకెట్లు పట్టుకుని వడ్డించి మొత్తం ఉమానే చేస్తున్నట్లు డ్రామాలు చేస్తున్నాడన్నారు.
టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వైసీపీ నేతలపై ధ్వజమెత్తారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి విమర్శనాస్త్రాలు సంధించారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్ కు గ్యారెంటీపై టీడీపీ ప్రచారంతో జగన్ అండ్ కో కు భయం పట్టుకున్నట్టుందని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టో ద్వారా ఏమేం చేస్తామో ప్రజలకు చెప్పేందుకు మేం ఊరూరా తిరుగుతుంటే వైసీపీకి వచ్చిన నొప్పేంటి? అని ధూళిపాళ్ల ప్రశ్నించారు.
ఎన్నికల హామీలపై ప్రచారం నిబంధనల ఉల్లంఘన ఎలా అవుతుంది? వైసీపీలో ఉన్న ఓటమి ఫ్రస్ట్రేషన్ అంతా ఆఫ్ నాలెడ్జ్ ఫెలో, క్యాంప్ ఆఫీసు సీనియర్ క్లర్కు సజ్జలలో కనిపిస్తోంది. మేం అధికారంలోకి రావడం ఖాయం… నువ్వు, నీ కొడుకు ఉద్యోగాలు ఊడి నిరుద్యోగులు అవ్వడం ఖాయం. టెన్షన్ వద్దు సజ్జలా… మీ అబ్బాయికి యువగళం పథకం కింద నెలకు రూ.3 వేలు ఇస్తాం. ఎలాంటి వివక్ష లేకుండా మీ కొంపకి కూడా బాబు ష్యూరిటీ పథకాలు అందిస్తాం” అంటూ ధూళిపాళ్ల నరేంద్ర వ్యంగ్యం ప్రదర్శించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేటి నుంచి తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తున్నాయి. 119 నియోజకవర్గాలకు గాను బీజేపీ 111, జనసేన 9 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇటీవల ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీసీల ఆత్మగౌరవ సభలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు పవన్ పాల్గొన్నారు. ఇప్పుడు బీజేపీ, జనసేన అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. నేడు వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రావు పద్మకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 25న తాండూరులో జనసేన అభ్యర్థి శంకర్ గౌడ్, 26న కూకట్ పల్లిలో జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే సభలలోనూ ఆయన పాల్గొననున్నారు.
నారా లోకేష్ నవంబర్ 24 నుంచి యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 9న చంద్రబాబు అరెస్టుతో యువగళం పాదయాత్ర ఆగిపోయింది. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇప్పటివరకు మొత్తం 2852.4 కిలోమీటర్ల దూరం నడిచారు. 208వ రోజు పొదలాడ, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం, కోనసీమ జిల్లా వద్ద పాదయాత్ర ఆగి పోయింది. అయితే పాదయాత్రను ముందుగా అనుకున్న ఇచ్ఛాపురం వరకు కాకుండా విశాఖలోనే ముగించే ఆలోచనలో నారా లోకేష్ ఉన్నారు. గతంలో చంద్రబాబు పాదయాత్ర విశాఖలోనే ముగించిన నేపథ్యంలో టీడీపీ విశాఖనే సెంటిమెంట్ గా భావిస్తోంది. దీంతో విశాఖలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడితో పాదయాత్ర ముగించాలని నారా లోకేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో విశాఖ వరకే చేయాలని నారా లోకేష్ అనుకుంటున్నట్లుగా సమాచారం.
స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆధారాలు లేవంటూ ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ…స్కిల్ కేసులో చంద్రబాబే సూత్రధారి అని స్పష్టం చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా చంద్రబాబును 37వ నిందితుడిగా చేర్చారని తెలిపారు. చంద్రబాబు నుంచే ఈ కుంభకోణం ఆలోచన మొదలైందన్నారు. ఆయన ఆమోదంతోనే నిధులు విడుదల అయ్యాయని ఆరోపించారు. చంద్రబాబు ఒత్తిడి తీసుకువచ్చి బ్యాంకు గ్యారెంటీల నుంచి సదరు కంపెనీలకు మినహాయింపులు ఇచ్చేలా చేశారని సజ్జల విమర్శించారు.
ఇన్ని చేసిన చంద్రబాబు ఏ1 కాక మరేమవుతారని సజ్జల ప్రశ్నించారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించింది. వాదనలు విన్న పిమ్మట ఏపీ హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. ఇటీవల చంద్రబాబుకు అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ ఇవ్వగా, ఆ బెయిల్ గడువు నాలుగు వారాలుగా న్యాయస్థానం పేర్కొంది. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో, చంద్రబాబు ఈ నెల 28న రాజమండ్రి జైలుకు వెళ్లనక్కర్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. మధ్యంతర బెయిల్ సమయంలో విధించిన షరతులు ఈ నెల 28 వరకే వర్తిస్తాయని వివరించింది. చంద్రబాబు నవంబరు 29 నుంచి రాజకీయ సభలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. అయితే ఈ నెల 30న చంద్రబాబు విజయవాడలో ఏసీబీ కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. తన చికిత్సకు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది.
అమరావతి నేడు ఢిల్లీ కి టీడీపీ నేతల బృందం. ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఢిల్లీలో రేపు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్న టీడీపీ నేతలు
టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్లనున్న యనమల, నిమ్మల రామానాయుడు, బోండా ఉమా, పయ్యావుల కేశవ్ బృందం
అధికార పార్టీ ఒత్తిడితో ఓటరు లిస్ట్ లో జరుగుతున్న అక్రమాలపై ఆధారాలతో ఫిర్యాదు చేయనున్న టీడీపీ నేతలు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ రావడంతో బిగ్ రిలీఫ్, AP, తెలంగాణలో పాలాభిషేకాలు చేస్తూ శ్రేణుల సంబరాలు స్కిల్ కేసులో బాబుపై ఆరోపణలే తప్ప.. ఆధారాల్లేవ్ అన్న న్యాయస్థానం 149 సాక్షులు, 4వేల పేజీల డాక్యుమెంట్లు అంతా తుస్సని తేల్చిన హైకోర్టు సత్యం గెలిచింది.. అసత్యంపై యుద్ధం మొదలైందన్న లోకేశ్ ఇక ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్న టీడీపీ అధినేత, యువనేత ఇంకా చాలా కేసులు ఉన్నాయంటూ కడుపు ఉబ్బరం బయటపెట్టిన సజ్జల చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తే తమకు జింతాత..జింతాతే..అంటూ వైసీపీలో టెన్షన్.
స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో చంద్రబాబు నాయుడుతోపాటు టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇకపోతే స్కిల్ స్కాం కేసులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబునాయుడు అనారోగ్య సమస్యలతో మధ్యంతర బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దానిపై హైకోర్టులో వాదనలు జరిగాయి. సుదీర్ఘ వాదనలు అనంతరం ఏపీ హైకోర్టు వాదనలు ముగిసినట్లు నవంబర్ 16న ప్రకటించింది.అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే సోమవారం చంద్రబాబు బెయిల్‌పై తీర్పు వెల్లడిస్తామని న్యాయమూర్తి వెల్లడించారు. దీంతో హైకోర్టులో చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించింది. అయితే రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఎలాంటి షరతులు విధించలేదు. కానీ నవంబర్ 28 వరకు మధ్యంతర బెయిల్లో విధించిన షరతులు వర్తిస్తాయని తెలిపింది. ఇకపోతే ఈ కేసులో చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించగా సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇకపోతే స్కిల్ స్కాం కేసులో అరెస్టైన వారెవరూ ఇప్పటి వరకు ఇన్ని రోజులు జైలులో ఉన్న దాఖలాలు లేవని తెలుస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు మాత్రమే 52 రోజులపాటు జైలులో ఉన్నట్లు హైకోర్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు అనారోగ్య సమస్యలను సైతం హైకోర్టు పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు కుడి కంటికి శస్త్రచికిత్స చేయించుకోవడం మరోవైపు గుండె పరిణామం పెరగడం ఇలాంటి కారణాల దృష్ట్యా చంద్రబాబుకు బెయిల్ వచ్చిందని తెలుస్తోంది.





Total views : 91182