66
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో చండీయాగం, సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు ఈ క్రతువుల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు దేవినేని ఉమా, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, కొల్లు రవీంద్ర, బోండా ఉమ, నారాయణ, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు కూడా పాల్గొన్నారు. ఏపీలో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు రానుండడం, ఇటీవల చంద్రబాబు జైలు నుంచి విడుదల కావడం, నారా లోకేశ్ యువగళం విజయవంతంగా ముగియడం తదితర పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ఇంట హోమాలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.