74
తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 7 నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం రెండు గంటల్లో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 7.78 శాతం పోలింగ్ నమోదు అయింది. ఈ విషయాన్ని ఎన్నికల అధికారులు ప్రకటించారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 35,655 పోలింగ్ కేంద్రాల్లో సుమారు 3.26 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది. దాదాపు లక్ష మంది రాష్ట్ర పోలీసులు, కేంద్ర పారామిలిటరీ బలగాలు, ఇతర రాష్ట్రాల హోంగార్డులను ఎలక్షన్ కమిషన్ వినియోగిస్తున్నది.