ఈ మంత్రి హరీష్ రావు గారు సందర్బంగా మాట్లాడుతు సిద్దిపేట ప్రజలే ప్రచారకులు ప్రజల ఆలోచన లు ప్రజల మనసు లోని కోరుకునే అభివృద్ధి కళ్ళముందు ఉంచాను ఆశీర్వదించండి. సిద్దిపేట ప్రజల ఆలోచన అభివృద్ధి పరీక్ష వ్రాసాను ఎన్ని మార్కులు వేస్తారో మీ నిర్ణయం ఎన్నికలప్పుడు వచ్చేది. ఎవరు ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండేది ఎవరు సిద్దిపేట ప్రజలు ఆలోచించాలి. సిద్దిపేట పేరు ప్రతిష్ట ను గౌరవాన్ని పెంచుకున్నాం. మరింత నిలబెట్టుక్కనేది ప్రజల ఆలోచన ఏడవసారి బి ఆర్ ఎస్ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేశాను. సిద్దిపేట ప్రజల ఆశీర్వాదం తో మంచి మెజార్టీ తో గెలిపించండి. ప్రతిరోజూ మీ కోసం 18గంటలు కష్టపడ్డ. మీ కష్ట సుఖల్లో ఉన్న సిద్దిపేట ప్రజలు నా కుటుంబ సభ్యులు ఆరు సార్లు అద్భుత విజయం అందించి సేవ చేసే అవకాశం ఇచ్చారు. ఐదేళ్లు కష్టపడి పనిచేశా మీ ఆత్మా సాక్షిగా నాకు మార్కులు వేయండి. సిద్దిపేట ప్రజలు కోరుకున్న పనులే కాకుండా కోరని ఎన్నో పనులు చేశా. ఆనాడు తెలంగాణలో కరువు కాటకాలు, ఆకలి చావులు, వలసలు ఉండేవి. నేడు రాష్ట్రాన్ని కెసిఆర్ రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారు. రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో 24లక్షల ఉద్యోగాలు, ఐటీ లో 6లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ రంగంలో లక్ష 80వేల ఉద్యోగాలు కల్పించాం. కొంతమంది ప్రక్క రాష్ట్రం నాయకులు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు, వారు ఇక్కడ ఎం చెప్పదలచుకున్నారు ,ఓటు అడిగే నైతికత లేదు. దేశానికి దిక్సూచిగా తెలంగాణ ను కెసిఆర్ తీర్చిదిద్దారు. కెసిఆర్ పై సెన్సేషన్ ల్ కామెంట్స్ కోసం నోరు జారీ మాట్లాడుతున్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి చేతుల్లో ఉంటే ఎలా క్షేమంగా ఉంటాదో కెసిఆర్ చేతుల్లో కూడా రాష్ట్రం అలాగే ఉంటది. నమ్మిన నాయకుడు కెసిఆర్ నీ కాదని ఇతర పార్టీలకు ఓట్లు వేయద్దు. బీజేపీ, కాంగ్రెస్ వాళ్లకు ఓటు వేస్తే 10ఎండ్లు తిరిగి వెనుకకు రాష్ట్రం పోతుంది. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ బీజేపి వాళ్ళు అభివృద్ధి చేయలేదు. సిద్దిపేట ప్రజలపై నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది.
సిద్దిపేట లో నామినేషన్ వేసిన మంత్రి హరీష్..
152
previous post