తెలంగాణ రాజకీయాల్లో(Telangana politics) తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న రాధాకిషన్ రావు(Radhakishen Rao), ప్రణీత్ రావు(Praneet Rao), భుజంగ రావు(Bhujangarao), తిరుపతన్నలపై సైబర్ టెర్రరిజం సెక్షన్ లు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధం అయ్యారు. దేశ భద్రతకు సాఫ్ట్ వేర్ ద్వారా ముప్పు వాటిల్లేలా చేస్తే వారిపై ఐటీ యాక్ట్ 66 (ఎఫ్)కింద నమోదు చేసే సైబర్ టెర్రరిజం కేసులు ప్రయోగిస్తారు.
ఇది చదవండి: ఇంటర్ ఫలితాలలో “అల్ఫోర్స్” చారిత్రాత్మక విజయం…
ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని అక్రమంగా చొరబడి తస్కరించిన ఈ నలుగురు నిందితులపై ఐటీ యాక్ట్ 66 (ఎఫ్) కేసులు జోడించేందుకు అనుమతి కోరుతూ పంజాగుట్ట పోలీసులు తాజాగా నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ సెక్షన్ కింద కేసు నిరూపణ జరిగితే జీవిత ఖైదీగా శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాగా ఇప్పటికే వీరిపై ఐటీ యాక్ట్ 70 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 70లో 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- పల్లె, పట్నం తేడా లేకుండా వణికిస్తున్న చలిపల్లె పట్నం తేడా లేకుండా రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. పలుచోట్ల రాత్రిళ్లు చలి మంటలు, ఉదయం పూట పొగ మంచు దృశ్యాలే కనిపిస్తున్నాయి. రెండు మూడు రోజులుగా రాష్ట్రంపై మంచుదుప్పటి పరుచుకున్నట్లు వాతావరణం మారింది. రాత్రిపూటే కాకుండా మిట్ట…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి