ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహారాష్ట్రలో ఆయన అన్నీ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. కరీంనగర్లో కార్యకర్తలతో కలిసి ఆయన ‘జితేందర్ రెడ్డి’ సినిమాను చూశారు. సినిమా యూనిట్‌ను ఆయన అభినందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ అంటేనే అబద్ధాలు అన్నారు. అందుకే మోసాలు, అబద్ధాలకు రేవంత్ రెడ్డి కేరాఫ్ అడ్రస్‌గా మారారని విమర్శించారు.
ఆరు గ్యారెంటీలపై మహారాష్ట్రకు వెళ్లి అబద్ధాలు చెప్పడం కాదని… తెలంగాణలో ఉండి చెప్పాలని సవాల్ చేశారు. నిజంగానే ఆరు గ్యారెంటీలు అమలు చేసి ఉంటే కోట్లాది రూపాయలు ఖర్చు చేసి మహారాష్ట్రలో యాడ్ ఇచ్చారని, అందులో వీటిని ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు. రైతులందరికీ రుణమాఫీ చేశామని సీఎం చెప్పారని… కానీ 20 లక్షల మంది రైతులకు మాఫీ కాలేదన్నారు. ఇతర హామీలు కూడా అమలు చేయలేదన్నారు.
హామీలు నెరవేర్చకుండానే మహారాష్ట్రకు వెళ్లి అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటు అన్నారు. మేమూ మహారాష్ట్రలో తెలంగాణ కాంగ్రెస్ నేతల బండారాన్ని బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వంపై పదకొండు నెలల కాలంలోనే వ్యతిరేకత వచ్చిందన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకున్నారని తెలిసే హర్యానాలో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని వ్యాఖ్యానించారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీపై యుద్ధం చేస్తామని సీఎం అంటున్నారని… ఎందుకు చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. 80 కోట్ల మందికి ఉచిత బియ్యం ఇస్తున్నందుకా? రోడ్లకు నిధులు ఇస్తున్నందుకా? స్మార్ట్ సిటీలు తయారు చేస్తున్నందుకా? గ్రామాలను అభివృద్ధి చేస్తున్నందుకా? ఎందుకు యుద్ధం చేస్తారో చెప్పాలన్నారు.
రాష్ట్రంలోని ఒక్కో వ్యక్తిపై కేసీఆర్ ప్రభుత్వం రూ.1 లక్ష అప్పు చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుమించి చేస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను ఎప్పుడో మరిచిపోయారన్నారు. అందుకే ఆయన ఫాంహౌస్‌కు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ వంటి వారిని తెలంగాణ సమాజం లీడర్‌గా భావించదన్నారు. రాష్ట్రంలో సమస్యలు వచ్చినప్పుడు బయటకు రాని కేసీఆర్… కేటీఆర్ బావమరిది రేవ్ పార్టీలో దొరికితే మాత్రం డీజీపీకి ఫోన్ చేస్తానని అంటున్నాడని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బీజేపీకే ఓటేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఉన్నది ఒకటే ఇజం..అదే టూరిజందేశంలో సీప్లేన్ రీలాంచ్ కు ఏపీ రాజధాని అమరావతి వేదిక అయ్యింది. శ్రీశైలం-విజయవాడ మధ్య నిర్వహించిన సీ ప్లేన్ ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. కేవలం 30 నిమిషాల్లోనే విజయవాడ నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్ దూసుకెళ్లింది. అభివృద్ధిని…
- అజ్ఙాతంలో నటి కస్తూరిసినీ నటి కస్తూరి చేసిన కామెంట్స్ చివరకు మెడకే చుట్టుకునేలా మారాయి. తెలుగు వాళ్లు, ప్రాంతీయతపై కస్తూరి వ్యాఖ్యలు వివాదానికి దారి తీయడమే కాకుండా రాజకీయంగా, సినిమాల పరంగా ఆమెకు ఉచ్చులా బిగుస్తున్నాయి. తమిళనాడులో ఉండే తెలుగు వాళ్ల…
- నేడు దక్షిణాఫ్రికాతో ఇండియా రెండో టీ20సాతాఫ్రికాతో 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు ఇండియా రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టుతో తలపడనుంది. డర్బన్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో సంజు శాంసన్ 50 బంతుల్లో 107 పరుగులు చేసి రాణించడంతో టీమిండియా 61…
- కాంగ్రెస్ బండారం బయటపెడతామన్న కేంద్రమంత్రిముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహారాష్ట్రలో ఆయన అన్నీ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. కరీంనగర్లో కార్యకర్తలతో కలిసి ఆయన ‘జితేందర్ రెడ్డి’ సినిమాను చూశారు. సినిమా యూనిట్‌ను ఆయన అభినందించారు. అనంతరం…
- యాదాద్రిలో సీఎం రేవంత్ రెడ్డియాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్నారు సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు. ఈవేళ సీఎం రేవంత్‌రెడ్డి పుట్టిన రోజు కావడంతో హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాఫ్టర్‌లో యాదగిరి గుట్టుకు చేరుకున్నారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో వేద పండితులు ప్రత్యేక…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి