తెలంగాణలో భారత రాష్ట్ర సమితి పాలన దేశ చరిత్రలోనే సువర్ణ అధ్యాయమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పదేళ్ల ప్రగతిపై కాంగ్రెస్ ప్రభుత్వం బురదజల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రానికి కౌంటర్ గా తెలంగాణ భవన్ లో ఆదివారం ‘స్వేద పత్రం’ విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ అప్పు కేవలం రూ.3.17 లక్షల కోట్లేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం అప్పులను ఎక్కువ చేసి చూపిస్తోందని ఆరోపించారు. తద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, తమను బదనాం చేయాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై తెలంగాణ భవన్ లో కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణను విఫల రాష్ట్రంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్ని ఇదే కాంగ్రెస్ నేతలు విధ్వంసం చేశారని ఆరోపించారు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించిన బీఆర్ఎస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. శ్వేతపత్రాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
Read Also..
Read Also..