సత్తెనపల్లిలో కన్నా క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సత్తెనపల్లి టిడిపి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రేపు జరిగేటువంటి ఎన్నికల్లో కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తాడని ప్రకటించారు. దీనిలో ఎవరికి ఏ విధమైనటువంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. ఎవరైనా మాకు టికెట్ వస్తుందని చెప్పుకుంటు తిరిగితే అది అబద్ధ ప్రచారమే, అటువంటి అబద్ధ ప్రచారాన్ని నియోజకవర్గంలో ఎవరు నమ్మ వద్దని అన్నారు. తెలుగుదేశం పార్టీ అభిమానులు నాయకులు పార్టీ విజయానికి కృషి చేయాలని అచ్చం నాయుడు చంద్రబాబు నాయుడి మాటగా ఈ రోజు చెప్పడం జరిగిందని అన్నారు. చంద్రబాబుకి, లోకేష్ బాబుకి, అచ్చం నాయుడుకి, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులుకు సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు.
Former minister
తెలంగాణలో భారత రాష్ట్ర సమితి పాలన దేశ చరిత్రలోనే సువర్ణ అధ్యాయమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పదేళ్ల ప్రగతిపై కాంగ్రెస్ ప్రభుత్వం బురదజల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రానికి కౌంటర్ గా తెలంగాణ భవన్ లో ఆదివారం ‘స్వేద పత్రం’ విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ అప్పు కేవలం రూ.3.17 లక్షల కోట్లేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం అప్పులను ఎక్కువ చేసి చూపిస్తోందని ఆరోపించారు. తద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, తమను బదనాం చేయాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై తెలంగాణ భవన్ లో కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణను విఫల రాష్ట్రంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్ని ఇదే కాంగ్రెస్ నేతలు విధ్వంసం చేశారని ఆరోపించారు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించిన బీఆర్ఎస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. శ్వేతపత్రాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
Read Also..
Read Also..
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు పి. సబితా ఇంద్రారెడ్డి. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని తుక్కుగూడ మున్సిపాలిటీ శ్రీనగర్ ఫ్యాబ్ సిటీలో ముక్కోటి(వైకుంఠ) ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు యువ నాయకులు కార్తీక్ రెడ్డితో కలిసి పి. సబితా ఇంద్రారెడ్డి ఉత్తరద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ప్రత్యేక పూజల అనంతరం తీర్థప్రసాదములు అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యురాలు సబితా ఇంద్రా రెడ్డి ప్రజలందరికి వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపతో మహేశ్వరం నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.





Total views : 90069