లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections)కు మరికొన్ని గంటల్లో గడువు ముగుస్తుందనగా కాంగ్రెస్ పార్టీ(Congress party) మూడు పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. ఖమ్మం(Khammam) నుంచి రామసహాయం రఘురామ్‌రెడ్డి(Raghuram Reddy), కరీంనగర్(Karimnagar) నుంచి వెలిచాల రాజేందర్రావు(Rajender Rao), హైదరాబాద్(Hyderabad) నుంచి సమీర్ వలీ ఉల్లా ఖాన్ పోటీ చేయనున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్(KC Venugopal) ప్రకటించారు. ఇప్పటికే ఈ ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. పార్టీ నుంచి బీ-ఫామ్ అందుకుని రిటర్నింగ్ ఆఫీసర్‌కు సమర్పించడమే మిగిలింది. గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు ఏఐసీసీ తెర దించింది. ఊహించినట్లుగానే ఖమ్మం స్థానానికి రఘురామ్‌రెడ్డి, కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్రావు పేర్లు ఖరారయ్యాయి. ఈ రెండు స్థానాల్లో సామాజిక సమీకరణాలకు ప్రత్యేకత ఉన్న పరిస్థితుల్లో ఏఐసీసీ నిర్ణయం ఆసక్తికరంగా మారింది.
ఇది చదవండి: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
ఈ ముగ్గురి పేర్లను ప్రకటించడంతో మొత్తం 17 స్థానాలకు అభ్యర్థులు ఖరారైనట్లయింది. నామినేషన్ల గడువు గురువారంతో ముగుస్తున్నందున ఇక ప్రచారం మొదలుపెట్టడమే తరువాయి. ఇప్పటివరకు ఈ స్థానాల్లో అభ్యర్థులెవరో తెలియకపోవడంతో ప్రచారం లాంఛనంగా ప్రారంభం కాలేదు. ఖమ్మం నియోజకవర్గం నుంచి పోట్ల నాగేశ్వరరావు, రాయల నాగేశ్వరావు, మరో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్లను దాఖలు చేసినా ఇప్పుడు లాంఛనంగా రఘురామ్‌రెడ్డి పేరును ఖరారు చేయడంతో వారు బరి నుంచి తప్పుకోవడం అనివార్యంగా మారింది. కరీంనగర్లో సైతం టికెట్ ఆశించిన అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. కానీ అక్కడ రాజేందర్రావును ఏఐసీసీ ఫైనల్ చేయడంతో ప్రవీణ్ రెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకోనున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- పల్లె, పట్నం తేడా లేకుండా వణికిస్తున్న చలిపల్లె పట్నం తేడా లేకుండా రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. పలుచోట్ల రాత్రిళ్లు చలి మంటలు, ఉదయం పూట పొగ మంచు దృశ్యాలే కనిపిస్తున్నాయి. రెండు మూడు రోజులుగా రాష్ట్రంపై మంచుదుప్పటి పరుచుకున్నట్లు వాతావరణం మారింది. రాత్రిపూటే కాకుండా మిట్ట…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి