• మొదట ఇచ్చిన వెసులుబాటుల్లోనే అసలు మతలబు
• ఎలైట్ రూల్స్-2016 పేరుతో ప్రత్యేక జీవో
• ఆ జీవోను అత్యంత రహస్యంగా ఉంచిన ప్రభుత్వం
• ఆ జీవోతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
• ఏడేళ్లలో ఖజానాకు రూ.133 కోట్ల నష్టం
• ఏ మద్యం దుకాణానికీ లేని రీతిలో మినహాయింపులు
• పన్నుల ఎగవేత, అనధికారిక విక్రయాలపై లేని పర్యవేక్షణ
• సమగ్ర అధ్యయనం తర్వాత ప్రభుత్వానికి నివేదిక
• టానిక్ నిర్వాహకులకు నోటీసులు జారీచేసే అవకాశం
• టానిక్ జీవో ద్వారా టెండర్లో పాల్గొనాలనుకున్న వాళ్లకు బెదిరింపులు
• టానిక్కు పూర్తిగా అండగా ఉన్న అప్పటి అధికారులు
• టెండర్ల ప్రక్రియ లేకుండానే టానిక్ ఏర్పాటుకు అనుమతి
• రాష్ట్రంలోని 2,620 దుకాణాల్లో దేనికీ ఈ వెసులుబాట్లు లేవు
• ఏడేళ్లపాటు ప్రత్యేక మినహాయింపులతో నిర్వాహకుల లబ్ది
• కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత టానిక్పై విచారణకు ఆదేశం
• టానిక్, 9 అనుబంధ షాపుల్లో తనిఖీలు, ఎలక్ట్రానిక్ డేటా సీజ్
• ఏడేళ్లలో రూ.1,500 కోట్ల మద్యం విక్రయించినట్లు గుర్తింపు
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
టానిక్ ఎలైట్ వైన్‌షాప్ వ్యవహారంలో దిమ్మదిరిగే అంశాలు బయటకు వస్తున్నాయి. కేవలం ఆ వైన్ షాప్ కోసమే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఊహించని రీతిలో వెసులుబాట్లు కల్పించిందన్న విషయం తేటతెల్లమవుతోంది. ఆ వెసులుబాటుల్లోనే అసలు మతలబు ఉందంటున్నారు.
2016లో టానిక్ వైన్ షాప్ కోసమే అప్పటి బీఆర్ ఎస్ సర్కారు.. ‘ఎలైట్ రూల్స్-2016’ పేరుతో ప్రత్యేక జీవోను వెలువరించింది. అయితే, ఆ జీవోను అత్యంత రహస్యంగా ఉంచింది. ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడింది. దీంతో, ఆ జీవో తోనే ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడింది.
మొత్తం ఏడేళ్లపాటు టానిక్ వైన్‌షాపుతో అమ్మకాలు సాగించారు. ఆ అమ్మకాలతో ఏడేళ్లలో ఖజానాకు 133 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. టానిక్ వైన్ షాపునకు.. ఏ మద్యం దుకాణానికీ లేని రీతిలో మినహాయింపులు ఇచ్చారు. అంతేకాదు.. ఆ షాపులో ఇష్టారీతిన సాగిన వ్యవహారంపైన ఎవరూ కన్నెత్తిచూడలేదు. పన్నుల ఎగవేత, అనధికారిక విక్రయాలపై అసలు పర్యవేక్షణ అనేది లేకుండా పోయింది.
అయితే, ఇప్పుడు ఈ అంశంపై సమగ్ర అధ్యయనం సాగిస్తున్న ప్రత్యేక బృందం.. పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. అదే సమయంలో టానిక్ నిర్వాహకులకు కూడా నోటీసులు జారీచేసే అవకాశం కనిపిస్తోంది.
అసలు టానిక్ వైన్ షాపుకోసం అప్పటి అధికారులు పూర్తిస్థాయిలో సహకారం అందించారన్న వాస్తవాలు బయటపడుతున్నాయి. టానిక్ జీవో గురించి తెలుసుకున్నకొందరు మద్యం వ్యాపారులు.. ఆ టెండర్లో పాల్గొనాలని ప్రయత్నించినా.. అధికారులు వాళ్లను బెదిరించి వెనక్కి తగ్గేలా చేశారు. దీంతో, అసలు టెండర్ల ప్రక్రియ లేకుండానే టానిక్ ఏర్పాటుకు ఏకపక్షంగా అనుమతి లభించింది.
మరోవైపు.. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 2వేల 620 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈ వైన్‌షాపుల్లో దేనికీ టానిక్ తరహా వెసులుబాట్లు కల్పించలేదు. ఫలితంగా ఏడేళ్ల పాటు ప్రత్యేక మినహాయింపులతో టానిక్ నిర్వాహకులు లబ్ది పొందారు.
అయితే, టానిక్ వ్యవహారాన్ని అనుమానించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మొత్తం టానిక్ దందాపైనే విచారణకు ఆదేశించింది. దీంతో, అధికారులు టానిక్ వైన్‌షాపు సహా.. దానికి అనుబంధంగా కొనసాగుతున్న మరో 9 వైన్ షాపుల్లోనూ తనిఖీలు నిర్వహించారు. ఎలక్ట్రానిక్ డేటాను, అనుమతి లేని మద్యం నిల్వలను సీజ్ చేశారు. ఈ దాడుల ద్వారా.. ఏడేళ్లలో పదిహేను వందల కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు టానిక్‌లో జరిగినట్లు అధికారులు గుర్తించారు.
తెలంగాణలోని 2వేల 620 వైన్ షాపుల ద్వారా సర్కారు ఖజానాకు భారీగా ఆదాయం లభిస్తోంది. కానీ, టానిక్ వైన్‌షాపు ఒక్క దానికి మాత్రం దోచుకునే అవకాశం కల్పించింది అప్పటి ప్రభుత్వం. మరి.. ఈ ఒక్కషాపు కోసమే ప్రత్యేకంగా జీవో అవసరమా? సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఖజానాకు వాటిల్లిన 133 కోట్ల రూపాయలకు బాధ్యులెవరు? అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మరి.. ఈ వ్యవహారంలో సమగ్ర దర్యాప్తు తర్వాత ప్రభుత్వం ఏం చేయబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. టానిక్ అక్రమ సంపాదనంతా కక్కిస్తారా? అనే ఆసక్తి కొనసాగుతోంది.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…