కొండగట్టు ఆంజనేయస్వామి (Kondagattu Anjaneya Swamy) ఆలయం:
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి (Kondagattu Anjaneya Swamy) ఆలయంలో నిధుల దుర్వినియోగంపై దేవదాయశాఖ ఉన్నతాధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టేందుకు నిర్ణయించారు. ఆలయానికి సంబంధించి 2014 నుంచి రికార్డుల పరిశీలనకు నిర్ణయించినట్లు, క్యాష్బుక్, బ్యాంకు స్టేట్మెంట్లు ఇతర ఫైళ్లను రీకన్సులేషన్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. గతంలో పనిచేసిన ఈవోల పదవీకాలంలోనూ నిధుల దుర్వినియోగం జరిగినట్లు అధికరులు భావిస్తున్నారు. దీంతో గతంలో కొండగట్టు అంజన్న ఆలయంలో విధులు నిర్వహించిన అధికారుల గుండెల్లో గుబులు మొదలైంది… అంజన్న ఆలయంలో జరిగిన అవినీతి పై అంజన్న భక్తులు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇదిలా ఉంటె అంజన్న ఆలయానికి భక్తితో భక్తులు ఇచ్చిన కానుకలు గాని… డబ్బులకు సరైన ఆధారాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. ఇప్పటికైనా విరాళాల పై ప్రతి ఆర్ధిక సంవత్సరం లో ఒక బుక్ లెట్ రిలీజ్ చేయాలని… పెద్ద మొత్తంలో వచ్చిన విరాళాలకు సంబంధించి అన్న దాన సత్రం లో గతంలో పాటించిన నియమ నిబంధనలను పాటించాలని అంజన్న భక్తులు ఎండోమెంట్ అధికారులను, ప్రభుత్వాన్ని కోరుతున్నారు… ఇప్పటికైనా ఎండోమెంట్ అధికారులు గాని… రాష్ట్ర ప్రభుత్వం గాని కొండగట్టు లో జరిగిన అవినీతి పై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే…
ఇది చదవండి: స్వతంత్రంగా పోటీ చేసి టీడీపీ కి చెక్ పెడతా..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి