కేసీఆర్(KCR) ఎన్నికల ప్రచారం ప్రారంభం..
కరీంనగర్ వేదికగా బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్(KCR) లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) కదనభేరీని మోగించనున్నారు. ఉద్యమ కాలం నుంచి సెంటిమెంట్‌గా వస్తున్న కరీంనగర్(Karimnagar) నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సభ ద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాలో తిరిగి పట్టు సాధించాలని బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బీఆర్ఎస్ కంచుకోట అయిన కరీంనగర్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో చుక్కెదురైంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 13 సీట్లకు గాను 12 సీట్లను గెలుచుకున్న గులాబీ పార్టీ 2023లో మాత్రం చతికిలపడింది. కేవలం ఐదింటిని మాత్రమే అత్తెసరు మెజారిటీతో సాధించి ఉనికి చాటుకుంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్(KCR) కరీంనగర్ వేదికగా లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఏ పథకమైనా, ఉద్యమమైనా కరీంనగర్ నుంచి ప్రారంభించి కేసీఆర్ విజయం సాధించారని ఇదే సెంటిమెంట్‌తో ఎస్ఎస్ఆర్ మైదానంలో సభ నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపి వినోద్ కుమార్ తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి