కాంగ్రెస్ పార్టీ(Congress party) పై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సెటైర్లు వేశారు. భారతదేశంలో ఇతర పార్టీల నుంచి నేతల్ని చేర్చుకోవడం ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ అని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పార్టీ మారితే ఆటోమేటిక్గా సభ్యత్వం రద్దు అనే హామీని పేర్కొనడం స్వాగతించదగినదన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుందన్నారు.
ఇది చదవండి: తెలంగాణలో 3 రోజులు వర్షాలు…
ఇచ్చిన హామీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ విధానాలుంటాయన్నారు. ఒకవైపు తన మేనిఫెస్టోలో ఇతర పార్టీల నుంచి చేర్చుకోమంటూనే తెలంగాణలో కారు గుర్తు పై గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి ఎంపీ టికెట్ ఇచ్చిందన్నారు. మరొక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను రాజీనామా చేయకుండానే తన పార్టీలో కలుపుకుందన్నారు. రాహుల్ గాంధీకి తమ హామీలపైన నిబద్ధత ఉంటే ఈ అంశం పైన మాట్లాడాలన్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి