హైదరాబాద్ నగరంలోని ఓ ఫాం హౌస్ లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీని నార్సింగి పోలీసులు, ఎక్సైజ్ శాఖ, Cyberabad SOT పోలీసులు భగ్నం చేశారు. అయితే ఫాం హౌస్ కేటీఆర్ బావ మరిది రాజ్ పాకాలది కావడంతో హాట్ టాపిక్ గా మారింది. జన్వాడ రిజర్వ్ కాలనిలో ఉన్న రాజ్ పాకాల ఫాం హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందని పోలీసులకు సమాచారం అందించింది. రాజ్ పాకాల ఫాం హౌస్ లో సైబరాబాద్ ఎస్వోటీ, నార్సింగి పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు గుర్తించి, పార్టీలో పాల్గొన్న వాళ్ళ కి డ్రగ్స్ టెస్ట్ చేపించగా అసలు వ్యవహారం బయటపడింది.
డ్రగ్స్ పార్టీ లో పాల్గొన్న ఒక వ్యక్తికి కొకైన్ డ్రగ్ పాజిటివ్ గా తేలినట్లు సమచారం. డ్రగ్స్ తీసుకున్నట్లు మరికొందరికీ సైతం టెస్టుల్లో పాజిటివ్ గా రావడం కలకలం రేపుతోంది. పార్టీలో పాల్గొన్న వారు కొకైన్ తీసుకున్నట్లు డ్రగ్ టెస్ట్ లో తేలడంతో Ndps యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. రాజ్ పాకాల ఫాం హౌస్ లో డ్రగ్స్ పార్టీపై Ndps యాక్ట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ పార్టీలో డ్రగ్స్, విదేశీ మద్యం వినియోగించినట్లు గుర్తించారు. దొరికిన ఫారిన్ బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. Section 34, Excise Act కింద మరో కేసు సైతం నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జన్వాడ ఫాం హౌస్ లో భారీ శబ్దం చేస్తూ పార్టీ నిర్వహిస్తున్నారని పోలీసులు సమాచారం అందింది. డయల్ 100కు ఫోన్ చేసి డ్రగ్స్ పార్టీపై సమాచారం రావడంతో పోలీసులు, సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని డ్రగ్స్ పార్టీని అడ్డుకున్నారు. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న 21 మంది పురుషులు, 14 మంది యువతులు, ఆడవారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. జన్వాడ ఫాం హౌస్ లో లిక్కర్ కు ఎక్సైజ్ శాఖ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని అధికారులు తెలిపారు.
అర్థరాత్రి భారీ డీజే సౌండ్స్ తో డ్రగ్స్ పార్టీ నిర్వహించారని పోలీసులు చెబుతున్నారు. విజయ్ మద్దూరికి డ్రగ్ టెస్టులో పాజిటివ్ గా తేలింది. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా మార్చుతామని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపడంలో భాగంగా యాంటీ నార్కోటిక్స్ కు సంబంధించి ఓ విభాగం ఏర్పాటు చేసి చీఫ్ ను నియమించారు. సీఎం రేవంత్ ఎప్పటికప్పుడూ డ్రగ్స్ నియంత్రణపై ఎక్సైజ్ శాఖ, యాంటీ నార్కోటిక్స్, సంబంధిత విభాగాల అధికారులతో సమావేశమై అప్ డేట్స్ తెలుసుకుంటున్నారు. డ్రగ్స్ అరికట్టేందుకు ఎలాంటి చర్యలైనా తీసుకోవాలని, లేకపోతే యువత చెడ్డదారిని ఎంచుకుని జీవితాలు నాశనం చేసుకునే అవకాశం ఉందని పలుమార్లు ప్రస్తావించారు. గతంలో సన్ బర్న్ పేరుతో డ్రగ్స్ పార్టీలు నిర్వహించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలుతెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు. అనంతరం పలు నిర్ణయాలకు మంత్రులు ఆమోదం తెలిపారు. ములుగులో సమ్మక్క-సారలమ్మ వర్సిటికి తక్కువ ధరకే భూములు…
- కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై మధుయాష్కీ కీలక వ్యాఖ్యలుకాంగ్రెస్లో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ హీట్ రేపుతున్న వేళ సీనియర్ నేత మధుయాష్కీ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై మధుయాష్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ…
- అమెరికా పర్యటనలో మంత్రి నారా లోకేశ్కృత్రిమ మేథ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐను అందిపుచ్చుకుని రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఉన్నట్టు మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ‘వై 2కే’ బూమ్ నేపథ్యంలో హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఐటీ రంగం అభివృద్ధి చెందిందని తెలిపారు. అదేవిధంగా…
- విమానంలో ప్రయాణించే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్విమానాల ద్వారా శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే దీక్షా స్వాములకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రానికి చెందిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్నాయుడు ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.…
- ఏపీ విమాన ప్రయాణికులకు శుభవార్తవిమాన ప్రయాణికులకు పౌరవిమానాయాన శాఖ ఓ శుభవార్త అందించింది. విశాఖపట్నం నుంచి విజయవాడ మధ్య మరో రెండు విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణాలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో అధికారులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి