తెలంగాణలో నేటినుంచి రుణ మాఫీ అమలు కానుంది. రుణ మాఫీ కార్యక్రమం అమలుకు తాము కట్టుబడి ఉన్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం అమలు కోసం నిద్రలేని రాత్రులు గడిపామని, రూపాయి రూపాయి పోగు చేసి ఈ కార్యక్రమం చేపట్టామని వెల్లడించారు.
అన్ని కుటుంబాలకు రుణమాఫీ చేస్తామని, రేషన్ కార్డులు లేని ఆరు లక్షల రైతు కుటుంబాలకు రుణ మాఫీ చేస్తున్నామని చెప్పారు. ఆగస్టు నెల దాటేలోపు రుణమాఫీ పూర్తి చేస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రుణ మాఫీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేతలు ప్రతి ఓటర్ వద్దకు తీసుకెళ్లాలని, తలెత్తుకుని ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం లక్ష రుణమాఫీని 25 వేల చొప్పున నాలుగు విడతల్లో పూర్తి చేసిందని తాము రెండు లక్షల రుణమాఫీని నెల వ్యవధిలోనే అమలు చేస్తున్నామని భట్టి తెలిపారు. ఏడు లక్షల కోట్ల అప్పుతో అధికారం చేపట్టినప్పటికీ, ఇచ్చిన హామీలపై ఎక్కడా వెనక్కి తగ్గడం లేదని డిప్యూటీ సీఎం తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
- పల్లె, పట్నం తేడా లేకుండా వణికిస్తున్న చలిపల్లె పట్నం తేడా లేకుండా రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. పలుచోట్ల రాత్రిళ్లు చలి మంటలు, ఉదయం పూట పొగ మంచు దృశ్యాలే కనిపిస్తున్నాయి. రెండు మూడు రోజులుగా రాష్ట్రంపై మంచుదుప్పటి పరుచుకున్నట్లు వాతావరణం మారింది. రాత్రిపూటే కాకుండా మిట్ట…
- మాజీ MLA వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం …మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు కృష్ణాజిల్లా గన్నవరంలోని వీరవల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. గత ప్రభుత్వంలో వైసీపీ నేతల దౌర్జన్య కాండకు టీడీపీ నేత మాదాల శ్రీనివాసరావు నష్టపోయారని ఫిర్యాదులో తెలిపారు. తన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి