కాంగ్రెస్‌లో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ హీట్ రేపుతున్న వేళ సీనియర్ నేత మధుయాష్కీ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై మధుయాష్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ పాలసీలు నచ్చి రాలేదని హాట్ కామెంట్స్ చేశారు. వారి అక్రమాస్తులు కాపాడుకునేందుకు, రాజకీయ భవిష్యత్ కాపాడుకునేందుకు మాత్రమే కాంగ్రెస్‌లో చేరారని.. కాంగ్రెస్‌పై ప్రేమతో కాదన్నారు మధుయాష్కీ. ఎమ్మెల్యేలు చేరిన చోటల్లా వారికి పార్టీని రాసివ్వలేదన్నారు. జగిత్యాల జిల్లా జాబితాపూర్ లో గంగారెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, విప్ లక్ష్మణ్ తో కలిసి పరామర్శించారు మధుయాష్కి. గంగారెడ్డి అతి దారుణంగా హత్యకి గురికావడం బాధకరమన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొన్న వ్యక్తి గంగారెడ్డి అని తనకి ప్రాణహాని ఉందని పోలీసులకి చెప్పుకున్నారని వెల్లడించారు. ప్రాణానికి ముప్పు ఉందని చెప్పిన పోలిసులు ఎందుకు పట్టించుకోలేదని ఆగ్రహించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
- పల్లె, పట్నం తేడా లేకుండా వణికిస్తున్న చలిపల్లె పట్నం తేడా లేకుండా రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. పలుచోట్ల రాత్రిళ్లు చలి మంటలు, ఉదయం పూట పొగ మంచు దృశ్యాలే కనిపిస్తున్నాయి. రెండు మూడు రోజులుగా రాష్ట్రంపై మంచుదుప్పటి పరుచుకున్నట్లు వాతావరణం మారింది. రాత్రిపూటే కాకుండా మిట్ట…
- మాజీ MLA వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం …మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు కృష్ణాజిల్లా గన్నవరంలోని వీరవల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. గత ప్రభుత్వంలో వైసీపీ నేతల దౌర్జన్య కాండకు టీడీపీ నేత మాదాల శ్రీనివాసరావు నష్టపోయారని ఫిర్యాదులో తెలిపారు. తన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి