సంఘ సేవకురాలు మరియు తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలను హుస్నాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రి భాయి పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ రజిత మాట్లాడుతూ నేడు మహిళలు గొప్ప స్థాయిలో ఉన్నత శిఖరాలు అధిరోహించ గలుగుతున్నారంటే దానికి కారణం విద్యనే అని, స్త్రీల విద్యాభివృద్ది, వారి హక్కుల కోసం పోరాడిన మొట్టమొదటి మహిళా ఉద్యమకారిణి సావిత్రి బాయి పూలే అని గుర్తు చేశారు. తన భర్త జ్యోతిభాపులేను ఆదర్శంగా తీసుకొని మహిళలకు పురుషులతో సమానంగా విద్యావకాశాలు కల్పించటానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. సావిత్రిబాయి పూలేను విద్యార్థినిలు స్ఫూర్తిగా తీసుకొని, బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు.
ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు..
114
previous post