జాతరలో చివరి ఘట్టం అయినా అగ్నిగుండాల కార్యక్రమాన్ని ఆలయ వర్గాలు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిన్న రాత్రి నుండే ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వీరశైవుల జగద్గురు కేంపిన మఠాదీశ్వరుడు చిన్న బసవ ప్రభు మహాస్వామి కొమురవెల్లి కి చేరుకున్నారు. ఆయన పర్యవేక్షణలో నిన్న సాయంత్రం ఆలయ ఆవరణలోని తోట బావి ప్రాంగణంలో వీరభద్ర పల్లెరం భద్రకాళి పూజలు నిర్వహించారు.
ఇది చదవండి: పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్న యరపతినేని, జంగా
గత రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి అగ్నిగుండాల కోసం తీసుకువచ్చిన కట్టెలకు నిప్పు అంటించగా ఉదయం నాలుగు గంటల వరకు ఆగ్గులు గా మారాయి. బలిహారం తర్వాత స్వామి వారితో ఆలయ పూజారులు అగ్నిగుండాలు దాటారు. భక్తులు శివాలు ఊగుతూ మల్లన్న స్వామి నామస్మరణ చేస్తూ భక్తి పారవశ్యంతో అగ్ని గుండాలు దాటారు. ఈ అగ్నిగుండాలను తొక్కేందుకు తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుండి వేలాది మంది భక్తులు హాజరయ్యారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారు లు పోలీస్ శాఖ అధికారులు అన్ని రకాల ఏర్పాటు చేశారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి