యాదాద్రి భువనగిరి జిల్లా: యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భువనగిరి పట్టణంలోని ఎస్సీ బాలికల హాస్టల్లో ఉంటున్న పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు తమ హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. విద్యార్థినుల హాస్టల్ గదిలో దొరికిన సూసైడ్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ హబ్సిగూడకు చెందిన బాలికలు సాయి కృప డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న ఎస్సీ హాస్టల్లో ఉంటూ భువనగిరిలోని పట్టణంలోని బాలికల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. అయితే శనివారం రోజున స్కూల్‌కు వెళ్లిన విద్యార్థినులు తిరిగి సాయంత్రం హాస్టల్‌కు వచ్చారు. అయితే శనివారం సాయంత్రం భవ్య, వైష్ణవిలు మాత్రం ట్యూషన్‌కు వెళ్లలేదు. మిగిలిన విద్యార్థులు అడగగా.. తర్వాత వస్తామని చెప్పారు. అయితే వీరు ట్యూషన్‌కు రాకపోవడంతో ట్యూషన్ టీచర్.. వారిని తీసుకురావాలని ఇతర విద్యార్థినులను పంపించారు. అయితే వారు ఉన్న హాస్టల్ గది తలుపులు వేసి ఉండటంతో.. కిటికీలో నుంచి చూడగా.. వారు ఆత్మహత్య చేసుకుని కనిపించారు. దీంతో విద్యార్థినులు వెంటనే ట్యూషన్ టీచర్‌కు ఈ విషయం చెప్పారు. ఈ ఘటనతో ఉలిక్కపడ్డ హాస్టల్ సిబ్బంది.. బలవంతంగా తలుపులు తీసి విద్యార్థినులను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మృతిచెందినట్టుగా వైద్యులు తెలిపారు. మృతదేహాలను పోస్టు మార్టమ్ నిమిత్తం మార్చురీకి తరలించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టింది. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థినుల గదిలో దొరికన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో తాము వెళ్లిపోతున్నందుకు అందరూ క్షమించాలని కోరారు. తాము చేయని తప్పుకు అందరూ మాటల అంటుంటే.. పడలేకపోతున్నామని పేర్కొన్నారు. తమను హాస్టల్ వార్డెన్ శైలజ మేడం తప్ప ఎవరూ నమ్మడం లేదని వాపోయారు. తమ బాధ ఎవరికి చెప్పుకోలేక వెళ్లిపోతున్నామని…. తమను ఒకే దగ్గర సమాధి చేయండి.. ఇదే తమ ఆఖరి కోరిక అని సూసైడ్ నోట్లో భవ్య, వైష్ణవిలు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు హాస్టల్ వార్డెన్ శైలజను, ట్యూషన్ టీచర్‌ను ప్రశ్నిస్తున్నారు. అయితే హాస్టల్లో విద్యార్థినుల మధ్య గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. భవ్య, వైష్ణవిలు తమను వేధింపులకు గురిచేస్తున్నారని అదే హాస్టల్లో ఉంటున్న జూనియర్ విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో.. హాస్టల్ సిబ్బంది వారిని మందలించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనను వారు అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకుని ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..మరోవైపు మృతులు ఇద్దర్ని హత్య చేసి..ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. Read Also..