కాంగ్రెస్ పాలనను ప్రజలు మెచ్చుకుంటున్నారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రంలోని ప్రజలంతా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో సామాన్యుల సమస్యలు అన్ని సులభంగా పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డ్రగ్స్ పై సీఎం రేవంత్రెడ్డి యుద్ధం ప్రకటించారని, అందుకు అనుగుణంగా యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను పటిష్టం చేశామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో పాత బస్తీతో పాటు నగరమంతా మెట్రోను విస్తరిస్తామని తెలిపారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ 14 స్థానాలను కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసిన కార్యకర్తలకు ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని మల్లు రవి స్పష్టం చేశారు.
Read Also,,
Read Also..