రానున్నది వేసవి కాలం కావడంతో హైదరాబాద్ ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తాగునీటిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ రొనాల్డ్ రాస్, కలెక్టర్ అనుదీప్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, జోనల్ కమిషనర్లు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. నగరంలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూసుకోవాలని జలమండలి అధికారులను ఆదేశించారు. వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి తలెత్తే ప్రాంతాలను ముందుగానే గుర్తించి సరఫరా చేయాలని సూచించారు. హైదరాబాద్ నగరం పేరు, గుర్తింపు దెబ్బతినకుండా అధికారులు మరింత అప్రమత్తంగా పని చేసి ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చూడాలని మంత్రి సూచించారు. కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి విబేధాలు లేవని అభివృద్ధిలో కేంద్రాన్ని కలుపుకొని ముందుకు వెళ్తామని పొన్నం తెలిపారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.