యువత వ్యక్తిత్వ వికాసానికి, శీల నిర్మాణానికి రామకృష్ణ మఠం అందిస్తున్న సేవలు ఎనలేనివని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కొనియాడారు. ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక జ్యోతి వెలిగించేందుకు, రామకృష్ణ మఠం దశాబ్దాలుగా చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. వ్యక్తుల సౌశీల్యంపై దేశ సౌశీల్యం ఆధారపడి ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ రామకృష్ణ మఠంలో అంతర్భాగమైన వివేకానంద ఇన్స్టిట్యూట్ అఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ రజతోత్సవ వేడుక సభ కు గవర్నర్ ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. నిరంతర అభ్యాసంతోనే పరిపూర్ణత సాధ్యమవుతుందని కార్య్రక్రమానికి హాజరైన విద్యార్థులకు సూచించారు. 1893 సెప్టెంబర్ 11 న చికాగో విశ్వవేదిక సాక్షిగా స్వామి వివేకానంద హిందూ ధర్మ గొప్పతనాన్ని చాటిచెప్పారని గవర్నర్ గుర్తుచేశారు. స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడవాలని విద్యార్థులకు జిష్ణు దేవ్ వర్మ సూచించారు.
ఇరవై ఐదేళ్ళ క్రితం సెప్టెంబర్ 11 న హైదరాబాద్ రామకృష్ణ మఠంలో నాటి రామకృష్ణ మఠం, మిషన్ జాతీయ సర్వాధ్యక్షుడు స్వామి రంగనాథానంద వివేకానంద ఇన్స్టిట్యూట్ అఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ విభాగాన్ని ప్రారంభించారని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద చెప్పారు. ఇప్పటివరకు ఇరవై లక్షల మందికి పైగా యువత కు వ్యక్తిత్వ వికాసం, శీల నిర్మాణం, యోగ, ధ్యానం, కమ్యూనికేషన్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చామన్నారు. యువతకు విలువలను, నైపుణ్యాలను అందించేందుకు వి.ఐ.హెచ్.ఈ ఇరవై ఐదు ఏళ్లుగా పని చేస్తోందని చెప్పారు. కార్యక్రమం లో రామకృష్ణ మిషన్, మఠం జాతీయ ఉపాధ్యక్షుడు స్వామి సుహితానంద, డెక్స్ టెరిటీ గ్లోబల్ వ్యవస్థాపకుడు శరద్ సాగర్, వి.ఐ.హెచ్.ఈ ఫాకల్టీ సభ్యులు, వాలంటీర్లు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కూచిపూడి నృత్యకళాకారిణి రాచర్ల నవ్య నేతృత్వంలో బాల్ వికాస్ విద్యార్థులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
- ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది. సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఖమ్మం నగరానికి సమీపంలోని రఘునాధపాలెం బీసీ గురుకుల పాఠశాలలో ఈఘటన జరిగింది. కీర్తి అనే విద్యార్థిని పలు మార్లు ఎలుక…
- విష్ణు గొడవ చేయలేదు … మనోజ్ కావాలనే ఇదంతా చేస్తున్నాడుమంచు మనోజ్ ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదన్నారు తల్లి మంచు నిర్మల. మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ వివాదంపై ఆయన భార్య నిర్మల తొలిసారి స్పందించారు. మంచు మనోజ్ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వస్తోన్న వార్తలపై ఆమె స్పష్టతనిచ్చారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి