తెలంగాణ(Telangana)లో నామినేషన్ల(Nominations) పరిశీలన ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు 625 నామినేషన్లను ఆమోదించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 893 మంది 1488 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 268 మందికి చెందిన 428 సెట్లను ఈసీ తిరస్కరించింది. మల్కాజ్‌గిరిలో 114 మంది నామినేషన్లు దాఖలు చేయగా 77 తిరస్కరణకు గురయ్యాయి. మెదక్‌లో ఒక నామినేషన్ తిరస్కరణకు గురైంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మెదక్‌లో 53, ఆదిలాబాద్‌లో 13, పెద్దపల్లిలో 49, కరీంనగర్లో 33, నిజామాబాద్‌లో 32, జహీరాబాద్‌లో 26, సికింద్రాబాద్‌లో 46, హైదరాబాద్‌లో 38, చేవెళ్లలో 46, మహబూబ్ నగర్లో 35, నాగర్ కర్నూలులో 21, నల్గొండలో 31, భువనగిరిలో 51, వరంగల్‌లో 48, మహబూబాబాద్‌లో 25, ఖమ్మంలో 41 నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు ఆమోదించినట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు.
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- పల్లె, పట్నం తేడా లేకుండా వణికిస్తున్న చలిపల్లె పట్నం తేడా లేకుండా రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. పలుచోట్ల రాత్రిళ్లు చలి మంటలు, ఉదయం పూట పొగ మంచు దృశ్యాలే కనిపిస్తున్నాయి. రెండు మూడు రోజులుగా రాష్ట్రంపై మంచుదుప్పటి పరుచుకున్నట్లు వాతావరణం మారింది. రాత్రిపూటే కాకుండా మిట్ట…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.